కాంగ్రెస్‌లో చేరనున్న 'నాగం'!

     Written by : smtv Desk | Sun, Apr 08, 2018, 02:57 PM

కాంగ్రెస్‌లో చేరనున్న 'నాగం'!

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 7: అభిమానులు, కార్యకర్తల అభీష్టం మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి ప్రకటించారు. శనివారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు ఇటీవలే బీజేపీకి రాజీనామా చేశానని అన్నారు.

అన౦తరం నియోజకవర్గంలోని కార్యకర్తలు, అభిమానులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న అభిమానుల అభిప్రాయాన్నితెలుసుకున్నానన్నారు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పడంతో ఆ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకొని పార్టీ అధిష్టానంతో మాట్లాడినట్టు చెప్పారు. వారు నిర్ణయించిన రోజు పార్టీలో చేరుతానని తెలిపారు.

Untitled Document
Advertisements