పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు: బాబా రాందేవ్‌

     Written by : smtv Desk | Wed, Apr 11, 2018, 11:11 AM

పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతు: బాబా రాందేవ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్ 11 ‌: నిజామాబాద్‌ జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుదని యోగా గురువు బాబా రాందేవ్‌ అన్నారు. మంగళవారం ఎంపీ కవిత కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బోర్డు ఏర్పాటు కోసం రైతులతో కలసి ఢిల్లీలో ధర్నా చేయాలని యోగా గురువు సూచించారు.
తెలంగాణ ఉద్యమ తరహాలో నిరసనలు చేస్తే కేంద్రం దిగి వస్తుందన్నారు. ఇదివరకే ఎంపీ కవిత ప్రధాన మంత్రికి , కేంద్ర మంత్రులను కలసి వినతులు సమర్పించారని అయినా కేంద్రం స్పందించడం లేదన్నారు. ఎంపీ కవిత మాట్లాడుతూ ప్రస్తుత జీవనశైలికి యోగా ఎంతో ఉపయోగకరమన్నారు.

Untitled Document
Advertisements