అల్జీరియాలో విషాదం..

     Written by : smtv Desk | Wed, Apr 11, 2018, 03:45 PM

అల్జీరియాలో విషాదం..

అల్జీరియా, ఏప్రిల్ 11 : అల్జీరియా లో విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ సైనిక విమానం దేశ రాజధాని నగరం అల్జీర్స్‌లోని బౌఫారిక్ విమానాశ్రయానికి కొద్ది దూరంలో కూలిపోయింది. ఈ విమానంలో దాదాపు 100 ఉన్నట్లు సమాచారం. అల్జీర్స్ నుంచి 30 కి.మీ. దూరంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం కూలగానే పెద్ద ఎత్తున నల్లని పొగలు వెలువడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

స్థానిక టెలివిజన్ ఛానళ్ళలో ప్రసారమవుతున్న దృశ్యాలనుబట్టి ప్రమాద స్థలానికి పెద్ద ఎత్తున సైనికాధికారులు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఈ విమానం తోక ఆలివ్ చెట్లపై వేలాడుతోంది. విమాన శకలాల నుంచి పొగ, జ్వాలలు వస్తున్నాయి. అత్యవసర సేవల సిబ్బంది, భద్రతా సిబ్బంది హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు, మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.





Untitled Document
Advertisements