కాంగ్రెస్ హయాంలో బీసీలకు అన్యాయం: చంద్రబాబు

     Written by : smtv Desk | Wed, Apr 11, 2018, 05:22 PM

కాంగ్రెస్ హయాంలో బీసీలకు అన్యాయం: చంద్రబాబు

విజయవాడ, ఏప్రిల్ 11: స్థానిక మున్సిపల్ స్టేడియంలో బుధవారం జ్యోతిరావు పూలే జయంతి వేడుకలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని, వెనుకబడిన వర్గాలు టీడీపీకి వెన్నెముక అని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్ హయాంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కేంద్రంతో విభేదాలు ఉన్నంత మాత్రాన సంక్షేమం, అభివృద్ధి ఆగదని, మోదీ ఏపీకి సాయం చేయకపోతే కేంద్రం నుంచి వడ్డీతో సహా ఎలా సాధించుకోవాలో మాకు తెలుసని సీఎం చంద్రబాబు తెలిపారు.

Untitled Document
Advertisements