వైసీపీ ఎంపీ ల దీక్ష భగ్నం..ఆస్పత్రికి తరలింపు

     Written by : smtv Desk | Wed, Apr 11, 2018, 06:01 PM

వైసీపీ ఎంపీ ల దీక్ష భగ్నం..ఆస్పత్రికి తరలింపు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: గత ఆరురోజులుగా ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఎంపీలు అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో వారిని ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రికి తరలించారు. ఎంపీ మిథున్‌రెడ్డి అల్సర్‌తో బాధపడుతున్నారు. అలాగే ఎంపీల శరీరంలో కీటోన్స్‌ పెరగడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

కాగా ఎంపీలను ఆస్పత్రికి తరలిస్తుండగా వైసీపీ కార్యకర్తలు అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పటికే ఆరోగ్యం క్షీణించడంతో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాదరావు, వైవీ సుబ్బారెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.ర్‌ఎంఎల్‌ ఆస్పత్రి సీనియర్‌ వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఎంపీలు మిథున్‌, అవినాష్‌ ఉన్నారు. దీక్షతో ఆరోగ్యం తీవ్రంగా విషమించిన కారణంగా ఫ్లూయిడ్స్‌ ఎక్కించుకోవాలని వైద్యులు ఎంపీలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారు వినిపించుకోకపోవడంతో బలవంతంగా ప్లూయిడ్స్‌ ఎక్కించారు.

Untitled Document
Advertisements