ఉద్యోగ నియామక పరీక్షల షెడ్యూల్‌ విడుదల

     Written by : smtv Desk | Wed, Apr 11, 2018, 06:26 PM

ఉద్యోగ నియామక పరీక్షల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్, ఏప్రిల్ 11‌: ఉద్యోగ నియామక పరీక్షల షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్‌సీ విడుదల చేసింది. గురుకుల జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, లైబ్రేరియన్లు, వ్యాయామ డైరెక్టర్లు, ప్రిన్సిపల్‌ ఉద్యోగాల నియామక ప్రధాన పరీక్ష షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ బుధవారం ప్రకటించింది. మే 12 నుంచి 17వరకు ప్రధాన పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది.ప్రాథమిక పరీక్ష ఆధారంగా ప్రధాన పరీక్షకు 6,521 మందిని ఎంపిక చేసింది. జూనియర్‌ కాలేజీల్లో లైబ్రేరియన్లు, డిగ్రీ కాలేజీ లైబ్రేరియన్ల పోస్టులకు మే 12, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు మే 13న, పాఠశాల ప్రిన్సిపల్‌ ఉద్యోగాలకు మే 14న జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు మే 15న, జూనియర్‌ కాలేజీ ప్రిన్సిపల్‌కు మే 16న, డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ ఉద్యోగాలకు మే 17న ప్రధాన పరీక్ష ఉంటుంది. గతేడాది సెప్టెంబరు 10న ప్రాథమిక పరీక్ష జరిగింది. ప్రాథమిక పరీక్ష ఫలితాలను జనవరి 20న ప్రకటించినప్పటికీ... డేటాలో లోపాల వల్ల వాటిని రద్దుచేసి పునఃసమీక్షించి తిరిగి నిన్న ప్రకటించారు.

Untitled Document
Advertisements