‘తప్పనిసరి తెలుగు’ అమలుకు చర్యలు!

     Written by : smtv Desk | Thu, Apr 12, 2018, 01:42 PM

‘తప్పనిసరి తెలుగు’ అమలుకు చర్యలు!

హైదరాబాద్‌, ఏప్రిల్ 12: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటి నుంచి పది తరగతుల వరకు తప్పనిసరిగా తెలుగును చదివేలా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఈ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన చర్యలపై దృష్టి సారించింది. 2018–19 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో, ఆరో తరగతిలో మొదటగా తెలుగును ప్రారంభించనుంది. ఇందుకు అవసరమైన పుస్తకాల రూపకల్పనకు చర్యలు ప్రారంభించింది.

బుధవారం జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో పుస్తకాల రూపకల్పనకు అవసరమైన ఎడిటర్స్‌ కమిటీ, కంటెంట్‌ రైటర్స్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పాఠశాల విద్యా కమిషనర్‌ కిషన్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పుస్తకాలను సమీక్షించి, విద్యార్థుల స్థాయికి అనుగుణంగా అవసరమైన మార్పులను ఈ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. మరోవైపు రాష్ట్ర సిలబస్‌ పాఠశాలలతోపాటు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తదితర సిలబస్‌ కలిగిన పాఠశాలల్లోనూ తెలుగు అమలుకోసం చేపట్టాల్సిన నిబంధనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.





Untitled Document
Advertisements