కామన్వెల్త్‌ గేమ్స్‌ : ఇద్దరు భారత అథ్లెట్లపై సస్పెన్షన్‌

     Written by : smtv Desk | Fri, Apr 13, 2018, 11:34 AM

కామన్వెల్త్‌ గేమ్స్‌ : ఇద్దరు భారత అథ్లెట్లపై సస్పెన్షన్‌

గోల్డ్‌కోస్ట్‌, ఏప్రిల్ 13: కామన్వెల్త్‌ గేమ్స్‌ లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది.'నో నీడిల్స్‌' (సిరంజీల వాడకం నిషేదం) పాలసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు భారత అథ్లెట్లు రాకేశ్‌ బాబు, ఇర్ఫాన్‌ కోలోథమ్‌ థోడ్‌పై కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్(సీజీఎఫ్‌)‌ సస్పెన్షన్‌ వేటు వేసింది. వారిని వెంటనే గోల్డ్‌కోస్ట్‌ వదిలి స్వదేశానికి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. క్రీడా గ్రామంలో సిరంజీలు వాడొద్దనే నింబధనల్ని బహిష్కరణకు గురైన భారత అథ్లెట్లు ఉల్లంఘించారని సీజీఎఫ్‌ తెలిపింది.

దీనిని తాము యాంటీ డోపింగ్ నిబంధనల ఉల్లంఘనగా చూడలేదని, అయితే నీడిల్ ఉపయోగించకూడదన్న గేమ్స్ నిబంధనలను మాత్రం వీరు ఉల్లంఘించారని సీజీఎఫ్‌ తెలిపింది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నుంచి బహిష్కరణకు గురైన రాకేష్‌ బాబు ట్రిపుల్‌ జంప్‌లో, ఇర్ఫాన్‌ రేస్‌ వాక్‌లో పోటీ పడాల్సి ఉంది. ఆటగాళ్లు డోపింగ్‌కు పాల్పడకుండా ఉండేందుకు ఈ ‘నో నీడిల్స్‌ ’ పాలసీని అమలు చేస్తున్నారు.





Untitled Document
Advertisements