మాస్ సంచలనానికి "ఆది"..

     Written by : smtv Desk | Fri, Apr 13, 2018, 04:28 PM

మాస్ సంచలనానికి

హైదరాబాద్, ఏప్రిల్ 13 : తమ అభిమాన కథానాయకుడి పుట్టిన రోజును ఎంతో ప్రత్యేకంగా ఏదైనా చేయాలని ప్రతి అభిమాని అనుకుంటాడు. అయితే వచ్చే నెల 20 వ తేదీన పుట్టిన రోజు జరుపుకోనున్న ఎన్టీఆర్ కు అభిమానులు తానూ నటించిన అన్ని సినిమాల్లోని పాత్రలతో ఓ 35 పేజీల పుస్తకాన్ని తయారు చేసిన విషయం తెలిసిందే.

ఈ పుస్తకంలోని ఒక్కో పేజీని ఒక్కోరోజు రిలీజ్ చేస్తూ ఎన్టీఆర్ సినీ ప్రయాణాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పేజీలను విడుదల చేశారు. తాజాగా మాస్ సంచలనానికి "ఆది" అంటూ పుస్తకంలోని మరో పేజీని పోస్ట్ చేశారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'ఆది' సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.





Untitled Document
Advertisements