కామన్‌వెల్త్‌ గేమ్స్‌ : భారత్ స్వర్ణాల సంఖ్యా 17

     Written by : smtv Desk | Fri, Apr 13, 2018, 04:42 PM

 కామన్‌వెల్త్‌ గేమ్స్‌ :  భారత్ స్వర్ణాల సంఖ్యా 17

గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 13 : ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతున్నా కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో తొమ్మిదో రోజు భారత్‌ స్వర్ణాల వేట కొనసాగుతోంది. భారత రెజ్లర్ బజరంగ్ పునియా భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం చేర్చాడు. రెజ్లింగ్‌లో 65 కేజీల పురుషుల ఫ్రీ స్టైల్ విభాగంలో భారత రెజ్లర్‌ బజరంగ్ పునియా బంగారు పతకం సాధించారు.

మరో వైపు భారత షూటర్‌ అనిష్‌ భన్వాలా కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణం తీసుకొచ్చి రికార్డు సాధించాడు. పదిహేనేళ్ల అనిష్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో అత్యంత చిన్న వయసులో భారత్‌కు మెడల్‌ సాధించిన క్రీడాకారుడిగా చరిత్ర లిఖించాడు. పురుషుల 25మీటర్ల రాపిడ్‌ ఫైర్‌ పిస్టోల్‌ విభాగంలో అనిష్‌ ఈరోజు బంగారు పతకం గెలుచుకున్నాడు. దీంతో భారత్ స్వర్ణాల సంఖ్య 17కు చేరుకుంది.





Untitled Document
Advertisements