మంత్రి కేటీఆర్ కు చేదు అనుభవం

     Written by : smtv Desk | Sat, Apr 14, 2018, 07:12 PM

మంత్రి కేటీఆర్ కు చేదు అనుభవంహైదరాబాద్, ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. రవీంద్రభారతిలో ఈరోజు జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడేందుకు లేవగా ఓ యువకుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల ఎందుకు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

జ్యోతిరావు పూలేకు నివాళి అర్పించి, అంబేద్కర్ కు ఎందుకు అర్పించలేదని ప్రశ్నించాడు. దీంతో, సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న వ్యక్తితో మాట్లాడాలని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవిని కేటీఆర్ ఆదేశించారు. స్టేజిపై నుంచి కిందకు వచ్చిన రవి... ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన వ్యక్తిని బయటకు పంపించివేశాడు.

Untitled Document
Advertisements