శ్రీ రెడ్డిపై వర్మ ప్రశంసల జల్లు

     Written by : smtv Desk | Mon, Apr 16, 2018, 02:43 PM

శ్రీ రెడ్డిపై వర్మ ప్రశంసల జల్లు

హైదరాబాద్, ఏప్రిల్ 16 : నటి శ్రీశక్తి(శ్రీరెడ్డి) పై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పొగడ్తల వర్షం కురిపించారు. ఆ మధ్య శ్రీరెడ్డి ఝాన్సీరాణిలా పోరాడుతోంది అంటూ ట్వీట్ చేసిన వర్మ... తాజాగా ఆమెను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు. శ్రీరెడ్డి అంటేనే పురుషులు భయపడిపోతున్నార౦టూ తెలిపారు.

అంతేకాదు శ్రీరెడ్డి గతాన్ని గూర్చి తెలుపుతూ.. ఆనాడు అశోకుడు వేల మందిని చంపాడు. చివరికి తన తప్పు తెలుసుకొని లక్షల మందిని కాపాడారు. అందుకే "శ్రీరెడ్డి కూడా అశోకుడిలా గొప్ప వ్యక్తి" అంటూ ట్వీట్‌ చేశారు. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మహిళలంతా ఆమె అంటే అసూయ పడేవారేనని.. నిజంగా శ్రీరెడ్డికి మద్దతుగా ఉన్న మహిళలు మాత్రమే శ్రీ(స్త్రీ)శక్తికి మద్దతుగా ఉంటారు" అని వర్మ పేర్కొన్నారు.


Untitled Document
Advertisements