నేపాల్ లో ఇండియా ఎంబసీ వద్ద పేలుడు

     Written by : smtv Desk | Tue, Apr 17, 2018, 11:35 AM

నేపాల్ లో ఇండియా ఎంబసీ వద్ద పేలుడు

ఖట్మాండు, ఏప్రిల్ 17: నేపాల్ రాజధాని నగరం ఖట్మాండులో మంగళవారం ఉదయం పేలుడు సంభవించింది. బిరాట్‌నగర్‌లోని భారత ఎంబసీ కార్యాలయం వద్ద బాంబు పేలడంతో కార్యాలయ గోడలు స్వల్పంగా ధ్వంసమైనట్లు అక్కడి మీడియా తెలిపింది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టంగానీ, గాయపడటంగానీ జరగలేదని అక్కడి అధికారులు వెల్లడించారు. ఓ రాజకీయ పార్టీ నిన్న బిరాట్‌నగర్‌లో బంద్‌కు పిలుపినిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో స్థానిక రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. పేలుడు తీవ్రత స్వల్పమే అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా రాయబార కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Untitled Document
Advertisements