న్యూ మూవీ కోసం.. చెర్రీ న్యూ లుక్

     Written by : smtv Desk | Tue, Apr 17, 2018, 04:43 PM

న్యూ మూవీ కోసం.. చెర్రీ న్యూ లుక్

హైదరాబాద్, ఏప్రిల్ 17 ‌: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమాలో 'చిట్టిబాబు' పాత్రతో ప్రేక్షకులని మెప్పించారు. చరణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపుతుంది. కాగా చెర్రీ ప్రస్తుతం యాక్షన్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలోనూ చరణ్ ఓ కొత్త గెటప్‌లో కన్పించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం కోసం అతను అపోలో లైఫ్‌ స్టూడియోలో కసరత్తులు చేస్తున్నారట.

ఈ విషయాన్ని చెర్రీ సతీమణి ఉపాసన ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ చరణ్‌ ఫొటోను పోస్ట్‌ చేశారు. "ఖాళీ కడుపుతో కార్డియో చేశారు. ఇప్పుడు వేరే సెషన్‌ కోసం అపోలో లైఫ్‌ స్టూడియోకు వెళుతున్నాం. ఆర్‌సీ 12 నిమిత్తం చరణ్‌ సరైన శరీర ఆకృతి కోసం ప్రయత్నిస్తున్నారు" అని పేర్కొన్నారు. ఇందులో చెర్రీకి జోడీగా కైరా అడ్వాణీ నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. ఇందులో చెర్రీకి జోడీగా కైరా అడ్వాణీ నటిస్తుండగా.. వివేక్ ఓబెరాయ్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు.

Untitled Document
Advertisements