సంధ్యపై కేసు పెడతాను : జీవితా రాజశేఖర్

     Written by : smtv Desk | Tue, Apr 17, 2018, 08:32 PM

సంధ్యపై కేసు పెడతాను : జీవితా రాజశేఖర్

హైదరాబాద్, ఏప్రిల్ 17 : టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్‌ వివాదం రోజురోజుకి ముదురుతుంది. తాజాగా ఈ విషయంపై సినీనటి జీవితా రాజశేఖర్ స్పందించారు. మీడియాలో తన కుటుంబంపై వస్తున్న వార్తలపై తీవ్రంగా మండిపడ్డారు. ఇటీవల మహిళా సంఘ నేతల ఆరోపణలపై జీవిత రాజశేఖర్‌ విలేకరులతో మాట్లాడారు. మహిళా సంఘ నేత సంధ్య ఓ చానల్‌లో మాట్లాడుతూ జీవితా రాజశేఖర్‌పై ఆరోపణలు చేశారు. దీనిపై జీవిత స్పందిస్తూ.. సంధ్య చేసిన ఆరోపణలు అవాస్తవం అని అన్నారు. సంధ్య మహిళల హక్కులను సంరక్షించే మీరు ఇలాంటివి ఎలా మాట్లాడతారని ఆమె ప్రశ్నించారు.

సంధ్యపై కేసు పెడతా..

"సంధ్య నాపై ఓ ఛానెల్‌లో అవాస్తవాలు మాట్లాడింది. ఎలాంటి ఆధారాలు లేకుండా సంధ్య నా గురించి ఎలా మాట్లాడుతుంది. సినీ ప్రముఖల కుటుంబాల గురించి ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నాపై, నాకుటుంబంపై అసత్య ప్రచారం చేసిన చానల్‌పై, సంధ్యలపై కేసు పెడతాను. అంతేకాకుండా పరువు నష్టం దావా వేస్తా. నాపై చేసిన ఆరోపణలకు సమాధానం వచ్చే నేను నిద్రపోను" అని వ్యాఖ్యానించారు.

శ్రీరెడ్డి విషయంలో ఏం న్యాయం జరిగింది

"శ్రీరెడ్డి విషయంలో ఏం న్యాయం జరిగిందో నాకైతే అర్థం కావడం లేదు. శ్రీరెడ్డికి సినిమాల్లో అవకాశాలు ఎలా ఇస్తారు? నటీనటుల ఎంపిక నిర్మాతల ఇష్టం పై ఆధారపడి ఉంటుంది. సినీ పరిశ్రమలో తప్పులు జరగడం లేదని నేను అనడం లేదు. అన్ని రంగాల్లో మహిళలపై వివక్ష జరుగుతూనే ఉంది. పరిశ్రమలో వివాదాలు తలెత్తినప్పుడు చర్యలు తీసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఒక్క సారి మోసపోతారు, పదేళ్లు మోసపోతుంటే ఏం చేస్తున్నారు. పరిశ్రమలోకి వచ్చే అమ్మాయిలంతా ఇలానే ఉంటారనేది తప్పు" అని జీవిత రాజశేఖర్ అన్నారు.





Untitled Document
Advertisements