అతని నిశ్శబ్దం చేతకానితనం కాదు..!! నాగబాబు మండిపాటు

     Written by : smtv Desk | Wed, Apr 18, 2018, 02:17 PM

అతని నిశ్శబ్దం చేతకానితనం కాదు..!! నాగబాబు మండిపాటు

హైదరాబాద్ ,ఏప్రిల్ 18 : గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ పరిణామాలు కాస్త జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగత దూషణ చేసే స్థాయికి రావడంతో సినీ నటుడు.. పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. అకారణంగా పవన్ కళ్యాణ్ ని తిడుతున్నారని.. ఇంకొకరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకొనే హక్కు ఎవరికీ లేదని ఆయన తెలిపారు.

'అతని నిశ్శబ్దం చేతకానితనం కాదు. మీ వెనకాల ఎలాంటి రాజకీయ శక్తులు ఉన్నాయో మాకు తెలుసు. మీ అందరికీ సరైన సమాధానం చెబుతాడు. అతన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా చేయించడం మంచిది కాదు' అని నాగబాబు మండిపడ్డారు. 'మీకు అతన్ని ఎదుర్కొనే దమ్ములేదు. మా తమ్ముడు నాతో మాట్లాడి ఆరేడు నెలలు అవుతుంది. కోట్ల రూపాయలు వచ్చే అవకాశం సినిమాల్లో ఉంది ఇక్కడే ఉండొచ్చు కదరా ఇవన్నీ ఎందుకు అని చెప్పినా, మా మాట చెవికి ఎక్కించుకోడు. వాడు నంబర్ వన్ స్టార్, ప్రజలకోసం జనాల్లోకి వచ్చాడు, వాడిని తిట్టడం సబబు కాదు' అని నిప్పులు చెరిగారు. 'కల్యాణ్ బాబు తప్పు చేస్తే.. పబ్లిక్ లో బహిరంగంగా నిలబడి నేనీ తప్పు చేశానని ఒప్పుకునే దమ్మున్న మగాడు. వ్యక్తిని ఎదుర్కోలేని వాళ్ళే వ్యక్తిత్వంపై బురద జల్లుతారనీ అలా చేయొద్దనీ వెల్లడించారు.





Untitled Document
Advertisements