వర్మ శ్రీకృష్ణుడు.. శ్రీరెడ్డి ద్రౌపది

     Written by : smtv Desk | Thu, Apr 19, 2018, 04:02 PM

వర్మ శ్రీకృష్ణుడు.. శ్రీరెడ్డి ద్రౌపది

హైదరాబాద్, ఏప్రిల్ 19 : 'ఆనాడు నిండు సభలో వస్త్రాపహరణం కావించబడుతున్న ద్రౌపదిని కాపాడింది ఆ కృష్ణుడు. ఈనాడు నిండు మీడియా సభలో తిట్లతో అభిషేకించబడుతున్న శ్రీరెడ్డిని కాపాడిన మరో కృష్ణుడు రామ్ గోపాల్ వర్మ' అని నెటిజన్లు వర్మ గురించి కామెంట్స్ చేస్తున్నారు.

'కాస్టింగ్ కౌచ్ వివాదంలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని లాగి తిట్టమని నటి శ్రీరెడ్డికి చెప్పింది నేనే' అని రామ్ గోపాల్ వర్మ వివరణ ఇచ్చిన నేపధ్యంలో.. వర్మ చెప్పింది అబద్దమని, శ్రీరెడ్డి తొందరపాటుతో చేసిన తప్పును తనపై వేసుకోవడానికి ఇలా అర్ధరహిత వివరణలు ఇస్తున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు.

అయితే పవన్ తో ఉన్న పాత గొడవల కారణంగా వర్మ ఇలా అన్నాడా? లేక పవన్ ఫాన్స్ నుండి శ్రీరెడ్డిని రక్షించాలని అన్నాడా? అని వర్మపై రకరకాలుగా వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపధ్యంలో వర్మ ఈ విషయంపై ఎలా స్పందిస్తాడో చూడాలి.





Untitled Document
Advertisements