సౌందర్య సాధనాలు..

     Written by : smtv Desk | Fri, Apr 20, 2018, 06:54 PM

సౌందర్య సాధనాలు..

హైదరాబాద్, ఏప్రిల్ 20 : మొటిమలు ముఖాన్ని అందవికారంగా కన్పించేలా చేస్తాయి. ఎన్ని క్రీములు వాడిన అవి మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి. సాధారణంగా కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. అవి మీ కోసం


>> మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోవాలంటే తురిమిన కాకరకాయ గుజ్జుని ఆయా ప్రాంతాల్లో రుద్దితే సరి.

>> మొటిమలు పూర్తిగా పోవాలంటే ఎండబెట్టిన తులసి ఆకుల్ని పొడిచేసి ఆ పొడికి ఒక టేబుల్ స్పూన్ పాలు, కొంచెం బాదం నూనె కలిపి రుద్దాలి.

>> చర్మం వడిలిపోయనట్లు తయారవుతుంటే ఇలా చేసి చూడండి:-

>> బాగా వండిన అరటిపండు గుజ్జును, ఒక టేబుల్ స్పూన్ తేనె, కాస్త నిమ్మరసం కలిపి వేసుకోండి. ఇది మంచి ఫేస్ ప్యాక్ లా పనిచేస్తుంది.

>> తాజా శ్వాసకోసం మౌత్ వాష్ వాడాలనుకుంటున్నారా? అయితే మీ ఇంటిలోనే అతి సులువుగా దాన్ని తయారుచేసుకోవచ్చు. నీళ్ళలో జామ ఆకులూ వేసి పది నిముషాలు మరగనివ్వాలి. చల్లారిన తర్వాత ఆ నీటిని మౌత్ వాష్ గా ఉపయోగించండి.

>>మేకప్ శుభ్రంగా పోవాలంటే శనగపిండి నీళ్ళు కలిపి ఆ మిశ్రమంతో రుద్దండి. మేకప్ తాలూకు గుర్తులు పూర్తిగా మటుమాయవుతాయి.

>> హెయిర్ డై చేసుకుంటున్నప్పుడు ఆ మరకలు పడి మీ బట్టలు పాడైతే వాటిని ఉతకడానికి ముందు ఉల్లిపాయలతో ఆ మరకల మీద రుద్దితే చాలు.

Untitled Document
Advertisements