నేను చేయగలనని నమ్ముతున్నారా.? : సమ౦త

     Written by : smtv Desk | Sat, Apr 21, 2018, 05:19 PM

నేను చేయగలనని నమ్ముతున్నారా.? : సమ౦త

హైదరాబాద్, ఏప్రిల్ 21 : "రంగస్థలం" లో రామలక్ష్మిగా ప్రేక్షకులను కట్టిపడేసి స‌క్సెస్‌ఫుల్ కెరీర్ లో దూసుకుపోతోంది సమ౦త. ఫిట్‌నెస్ అంటే ప్రాణ‌మిచ్చే ఆమె తరచూ తను జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తన భర్త నాగచైతన్య జిమ్ లో గడిపిన క్షణాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా సమ౦త పుల్‌అప్‌ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేశారు. "తొలిసారి నేను ఫుల్అప్స్ చేయ‌డానికి ప్రయత్నించి ఓడిపోయా. దీంతో 30 రోజుల టార్గెట్‌ సెట్‌ చేసుకున్నా. ఇంతకి నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా.?" అంటూ అభిమానులను ప్రశ్నిస్తూ ఒక ఫోటోను షేర్ చేశారు. ఇంతకి సమ౦త చేస్తుందని మీరు నమ్ముతున్నారా.! లేదా.!

Untitled Document
Advertisements