సెన్సార్ పూర్తి చేసుకున్న "నా పేరు సూర్య"..

     Written by : smtv Desk | Sat, Apr 21, 2018, 06:05 PM

సెన్సార్ పూర్తి చేసుకున్న

హైదరాబాద్, ఏప్రిల్ 21 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. వక్కంతం వంశీ కాంబినేషన్ లో రానున్న "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ఎటువంటి కట్టింగ్స్ లేకుండా U/A సర్టిఫికేట్ ను సంపాదించింది. మే 4 వ తేదీన విడుదల చేయనున్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈ నెల 22 న పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలోని సైనిక మాధవరం గ్రామంలో నిర్వహించనున్నారు.

బన్నీ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి 'ఫస్ట్ ఇంపాక్ట్', 'డైలాగ్ ఇంపాక్ట్' ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై నాగబాబు, లగడపాటి శ్రీధర్ నిర్మించారు. ఈ చిత్రానికి విశాల్-శేఖర్ సంగీతాన్ని అందించారు.

Untitled Document
Advertisements