బాలకృష్ణ ఇంటి ముట్టడికి బీజేవైఎం యత్నం..

     Written by : smtv Desk | Sat, Apr 21, 2018, 06:28 PM

బాలకృష్ణ ఇంటి ముట్టడికి  బీజేవైఎం యత్నం..

హైదరాబాద్, ఏప్రిల్ 20‌: సినీ నటుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం ఎదుట ఉద్రిక్త పరస్థితి నెలకొంది. బాలయ్య ఇంటిని ముట్టడించేందుకు బీజేవైఎం కార్యర్తలు ప్రయత్నించారు. బాలకృష్ణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్‌ చేసి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, ఏపీకి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షంలో పాల్గొన్న బాలయ్య.. ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ నేతలు, కార్యకర్తలు బాలకృష్ణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.

Untitled Document
Advertisements