సినీ ప్రముఖులతో మంత్రి తలసాని భేటీ..!!

     Written by : smtv Desk | Sat, Apr 21, 2018, 06:32 PM

సినీ ప్రముఖులతో మంత్రి తలసాని భేటీ..!!

హైదరాబాద్, ఏప్రిల్ 21 : తెలుగు సినీ పరిశ్రమలో తలెత్తిన వివాదాలపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తో "మా" ప్రతినిధులతో పాటు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సినీ రంగంలో ఉన్న సమస్యలు, లైంగిక వేధింపులపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం సినీ సమస్యలపై చర్యలు చేపట్టే దిశగా దృష్టి సారించింది.

ఇప్పటికే ఈ విభేదాలకు సంబంధించి జాతీయ మానవహక్కుల కమీషన్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోనున్నారు. ఈ సమావేశానికి పోలీస్ ఉన్నతాధికారులు, సినిమాటోగ్రఫీ శాఖ అధికారులు, సినీ ప్రముఖులు తదితరులు హాజరయ్యారు.

Untitled Document
Advertisements