కాస్టింగ్ కౌచ్ పై ఆదాశర్మ ఏమందంటే.?

     Written by : smtv Desk | Sun, Apr 22, 2018, 11:44 AM

కాస్టింగ్ కౌచ్ పై ఆదాశర్మ ఏమందంటే.?

హైదరాబాద్, ఏప్రిల్ 22 : ప్రస్తుతం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ విషయంపై సినీ ప్రముఖులు స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి ఆదాశర్మ కాస్టింగ్ కౌచ్ వివాదంపై స్పందించింది. సెక్సువల్ ఫేవర్ చేయడం, చేయకపోవడం అనేది పూర్తిగా వ్యక్తిగతమైన అంశమని స్పష్టం చేసింది. అయినా ప్రస్తుత పరిస్థితుల్లో పని కోసం "సెక్సువల్ ఫేవర్" చేసేందుకు కొంతమంది వెనుకాడటం లేదు.

ఇలాంటి సంఘటనలు ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు పలు చోట్ల ఉన్నాయని చెప్పుకొచ్చింది. అయితే తనకు మాత్రం ఇలాంటి పరిస్థితి ఎన్నడూ ఎదురుకాలేదని తెలిపింది. మహిళలను లైంగికంగా ఒత్తిడి చేయడం మాత్రం తప్పు అని వెల్లడించింది. దక్షిణాదిలో ఒక్క సినిమా హిట్ అయితే సినిమా ఆఫర్లు వాటంతట అవే వస్తాయని.. బాలీవుడ్ లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం అంటూ తెలిపింది.





Untitled Document
Advertisements