తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

     Written by : smtv Desk | Sat, Apr 20, 2019, 06:11 PM

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు విడులైంది. తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి నాగిరెడ్డి ఈ షెడ్యూల్ విడుదల చేయగా మొత్తం మూడు విడతలలో ఈ జెడ్పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెల 22న తొలి నోటిఫికేషన్, ఈ నెల 26న రెండవ విడత నోటిఫికేషన్, ఈనెల 30న మూడవ విడత నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మొత్తం 5,817 ఎంపీటీసీ స్థానాలతో పాటు 538 జెడ్పిటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మూడు విడతలలో మే 6, 10, 14 తేదీలలో ఎన్నికలు జరగనుండగా మే 27న లెక్కింపు, ఫలితాల విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 539 జడ్పీటీసీ స్థానాలు ఉండగా ఒక స్థానానికి మాత్రం ఎన్నికలు జరగడం లేదట. దీంతో తెలంగాణలోని మొత్తం 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో 212 జెడ్పీటీసీ, 2365 ఎంపీటీసీ స్థానాలకు, రెండో విడత ఎన్నికలలో 199 జడ్పీటీసీ, 2109 ఎంపీటీసీ స్థానాలకు, మూడో విడత ఎన్నికలలో 124 జడ్పీటీసీలు, 1343 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.





Untitled Document
Advertisements