చెన్నై నుంచి విశాఖకు 16 బోగీలతో వందే భారత్.. మరి ఆ వార్తలో నిజమెంత?

     Written by : smtv Desk | Mon, Aug 21, 2023, 10:57 AM

 చెన్నై నుంచి విశాఖకు 16 బోగీలతో వందే భారత్.. మరి ఆ వార్తలో నిజమెంత?

ప్రతిష్టాత్మక మధ్య వందేభారత్ రైలు సేవలు ప్రారంభం అయిన నాటి నుండి విడతల వారిగా కొన్ని రాష్ట్రాలలో కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా విశాఖపట్టణం-తిరుపతి మధ్య వందేభారత్ రైలును ప్రవేశపెడుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆదివారం సాయంత్రం చెన్నై నుంచి 16 బోగీలతో కూడిన రైలు విశాఖకు బయలుదేరినప్పటి నుంచీ ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. అయితే, వాల్తేరు రైల్వే అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని, ఈ విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.
మరోవైపు, ఇందుకు భిన్నమైన వార్తలు కూడా వినిపిస్తున్నాయి. విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు సాంకేతిక కారణాలతో తరచూ రద్దవుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు, రైలు రద్దయితే మరో రైలును వెంటనే అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతోనే చెన్నై నుంచి రైలును తెప్పిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది రైల్వే అధికారులు స్పందించే వరకు తెలియదు.





Untitled Document
Advertisements