చతికిల పడ్డ స్టాక్ మార్కెట్లు..

     Written by : smtv Desk | Tue, Sep 26, 2023, 04:14 PM

చతికిల పడ్డ స్టాక్ మార్కెట్లు..

ఉదయం ట్రేడింగ్ మొదలైంది మొదలు చివరి వరకు మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఎదో అద్భుతం జరిగి మార్కెట్లు పుంజుకుంటయేమో అని ఎదురుచూసిన వారి ఆశలు నిరాశలు చేస్తూ దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 78 పాయింట్లు నష్టపోయి 65,945కి పడిపోయింది. నిఫ్టీ 9 పాయింట్లు కోల్పోయి 19,664 వద్ద స్థిరపడింది. ఫైనాన్స్ సూచీ 1.55 శాతం నష్టపోయింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (1.45%), టాటా స్టీల్ (1.33%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.67%), బజాజ్ ఫైనాన్స్ (0.52%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.39%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-1.30%), ఇన్ఫోసిస్ (-1.00%), ఏసియన్ పెయింట్స్ (-0.89%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.85%), కొటక్ బ్యాంక్ (-0.83%).





Untitled Document
Advertisements