మార్కెట్లోకి గెలాక్సీ ఎస్9 ట్యాబులు.. యూనిక్ ఫీచర్లతో, ఆకర్షణీయమైన రంగుల్లో లభ్యం

     Written by : smtv Desk | Tue, Oct 10, 2023, 02:08 PM

మార్కెట్లోకి గెలాక్సీ ఎస్9 ట్యాబులు.. యూనిక్ ఫీచర్లతో,  ఆకర్షణీయమైన రంగుల్లో లభ్యం

ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కొత్తకొత్త ఫీచర్లతో అధునాతన టెక్నాలజీతో ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నాయి స్మార్ట్ ఫోన్ కంపెనీలు. శామ్ సంగ్ తాజా ఫీచర్లతో కూడిన ట్యాబ్ లను భారత మార్కెట్లో విడుదల చేసింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్9 ఎఫ్ఈ, ట్యాబ్ ఎస్9 ఎఫ్ఈ ప్లస్ ను తీసుకొచ్చింది. సాధారణంగా ట్యాబ్లెట్లలో ఎక్కువ కలర్ ఆప్షన్స్ ఉండవు. కానీ, ఇవి మంచి ఆకర్షణీయమైన రంగుల్లో వచ్చాయి. చూసే వారిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. గ్రే, మింట్, సిల్వర్, లావెండర్ రంగుల్లో ఇవి లభిస్తాయి.
ఎస్ పెన్ సాయంతో నచ్చిన విధంగా డ్రాయింగ్ వేసుకోవచ్చు. నోట్స్ రాసుకోవచ్చు. శామ్ సంగ్ నోట్స్, గూగుల్ నోట్స్ యాప్ లు తెరిచి అందులో కొత్త ఫైల్ ఓపెన్ చేసి ఎస్ పెన్ సాయంతో రాసుకోవచ్చు. అచ్చం పెన్ను మాదిరి అనుభవాన్ని ఇది ఇస్తుంది. ట్యాబ్ ఎస్9 ఎఫ్ఈ 10.9 అంగుళాల డిస్ ప్లే తో వస్తుంది. ట్యాబ్ ఎస్9 ఎఫ్ఈ ప్లస్ 12.4 అంగుళాల డిస్ ప్లేతో వస్తుంది. 90 హెర్జ్ అడాప్టివ్ రీఫ్రెష్ రేటుతో స్క్రీన్ ఉంటుంది. దీంతో వీక్షణా అనుభవం మెరుగ్గా ఉంటుందని శామ్ సంగ్ అంటోంది. ఎండలోకి వెళ్లినా స్క్రీన్ విషయంలో ఇబ్బంది ఉండదు.

ఈ రెండు ట్యాబ్ లకు ఐపీ68 రేటింగ్ ఉంటుంది. దీంతో నీరు, దుమ్ము పడినా పాడవకుండా రక్షణ ఉంటుంది. బయటకు తీసుకెళ్లే వారికి, మార్కెటింగ్ లో ఉన్న వారికి ఈ ఫీచర్ అనుకూలం. ఎస్9 ఎఫ్ఈ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ తో వస్తుంది. దీని ధర రూ.36,999. ఎస్9 ఎఫ్ఈ ప్లస్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ.46,999 నుంచి మొదలవుతుంది. బ్యాంక్ కార్డు డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.





Untitled Document
Advertisements