మీ చర్మం పొడిబారుతుందా? అయితే అరటి పండులో ఇది కలిపి రాయండి ..

     Written by : smtv Desk | Wed, Nov 15, 2023, 07:22 AM

మీ చర్మం పొడిబారుతుందా? అయితే అరటి పండులో ఇది కలిపి రాయండి ..

కాలం ఏదైనా సరే పొడిబారే చర్మం ఇబ్బంది కలిగిస్తుంది. మేకప్ వేసుకున్న అది విరిగినట్టుగా కనిపిస్తూ చికాకుకు గురిచేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో అయితే దాదాపు ప్రతిఒక్కరి చర్మ పొడిబారడం సహజం. ఇలా పొడిబారడం వలన చర్మం పై తెల్లని పొడి లాంటి ఛాయలు మీ ముఖపు సౌందర్యాన్ని తగ్గించేస్తాయి. ఇలా చర్మం నిర్జీవంగా మారినప్పుడు మీరు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది..

* అరటి పండ్లు యాంటీఆక్సిడెంట్లు మరియు పొటాషియంలకు గొప్ప మూలం అని చెప్పవచ్చు. అరటి పండు నిస్తేజంగా మారిన మరియు పొడిబారిన చర్మాన్ని సహజంగా పునరుజ్జీవింపజేస్తుంది. ఇక ఆలివ్ నూనె, ఇది చర్మానికి చాలా మంచి మాయిశ్చరైజింగ్ ఏజెంట్ అని చెప్పవచ్చు. ఈ రెండిటినీ కలిపి పొడి చర్మం కోసం ఒక గొప్ప ఫేస్ ప్యాక్ తయారు చేయవచ్చు. ఇందుకోసం ఒక పండిన అరటిపండును తొక్క తీసి గుజ్జు చేయాలి. మెత్తని అరటిపండు పేస్ట్ లో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన ముఖం మీద అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తరువాత నీటితో కడిగేయాలి. గొప్ప ఫలితాల కోసం సుమారు ఒక నెల పాటు వారానికి 2-3 సార్లు ఉపయోగించండి.

* కలబంద మరియు కొబ్బరి నూనె ఫేస్ ప్యాక్ పొడి చర్మం కోసం ఇంట్లోనే తయారు చేసుకోగలిగే సులభమైన మరియు ఉత్తమమైన ఫేస్ ఫ్యాక్ ఇది. కలబంద మరియు కొబ్బరి నూనె చర్మానికి సహజమైన డిటాక్సిఫైయర్లగా పనిచేస్తాయి. కాబట్టి పొడి చర్మ కోసం మీరు ఇంట్లోనే కలబంద మరియు లెమన్ ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఇంట్లో ఉన్న మొక్క నుండి కలబంద ఆకును తీయండి. అందులో నుండి కలబంద గుజ్జుని తీయండి. ఇప్పుడు కొబ్బరి నూనె మరియు కలబంద గుజ్జును కలుపుతూ మెత్తని పేస్ట్ లాగా తయారు చేయండి. ఆ పేస్ట్ ను చర్మం పై సమానంగా వర్తించి 15 నిమిషాలు ఆరనిచ్చి కడిగేయండి.

* పొడి చర్మం కోసం ఇంట్లో తయారు చేయగలిగే మరో ప్రభావవంతమైన ఫేస్ ప్యాక్ బొప్పాయి గుజ్జు ఫేస్ ప్యాక్. మీ చర్మాన్ని తిరిగి నింపే విటమిన్లు, మినరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్ లతో నిండింది పండిన బొప్పాయి. తేనె ఒక అద్భుతమైన సహజమైన మాయిశ్చరైజర్ అని అందరికీ తెలిసిన విషయమే ఇది చర్మంలో తేమను తిరిగి నింపడంలో బాగా ఉపయోగపడుతుంది. మృదువైన చర్మం కోసం అలాగే ముఖం పై ఉండే మచ్చలు, పొడి చర్మం మరియు మరణించిన కణాలను పోగొట్టుకునేందుకు సహాయపడుతుంది.





Untitled Document
Advertisements