75 ఏళ్ల సహారా గ్రూప్ ఫౌండర్ సుబ్రతా రాయ్ కన్నుమూత

     Written by : smtv Desk | Wed, Nov 15, 2023, 08:15 AM

75 ఏళ్ల సహారా గ్రూప్ ఫౌండర్ సుబ్రతా రాయ్ కన్నుమూత

నిన్న ఒబెరాయ్ హోటల్ వ్యవస్థాపకుడు మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్త మరువక ముందే సహారా గ్రూపు వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సుబ్రతా రాయ్ (75) మంగళవారం కన్నుమూశారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో తుదిశ్వాస విడిచారని కంపెనీ తెలిపింది. ప్రాణాంతకత మెటాస్టాటిక్ క్యానర్, బీపీ, మధుమేహం వ్యాధులతో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆయన ఈ ఆదివారం కార్డియోస్పిరేటరీ అరెస్ట్‌‌కు గురయ్యారని, చికిత్స పొందుతూ కన్నుమూశారని ప్రకటనలో కంపెనీ పేర్కొంది. ఆయన మృతితో కంపెనీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని పేర్కొంది.

సుబ్రతా రాయ్‌కి భార్య స్వప్నా రాయ్, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కుమారులు సుశాంతో రాయ్, సీమాంటో రాయ్ విదేశాల్లో ఉంటున్నారు. సుబ్రతా రాయ్ 1948లో బీహార్‌లోని అరారియాలో పుట్టారు. 1978లో ‘సహారా ఇండియా పరివార్’ ప్రారంభించడంతో ఆయన సక్సెస్ స్టోరీ మొదలైంది. కేవలం రూ.2,000 మూలధనంతో ప్రారంభినప్పటికీ వ్యవస్థాపకత విషయంలో కంపెనీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సుబ్రతా రాయ్ కృషి చేశారు. లక్నోను కేంద్రంగా చేసుకొని కంపెనీ కార్యకలాపాలను నిర్వహించారు. అయితే ‘సహారా చిట్ ఫండ్ స్కామ్’ కేసులో కంపెనీ అనేక సమస్యలను ఎదుర్కొంది. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రముఖలు సుబ్రతా రాయ్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements