తమ సంస్థ ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్

     Written by : smtv Desk | Mon, Nov 20, 2023, 11:56 AM

తమ సంస్థ ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్

ప్రముఖటెక్ దిగ్గజ సంస్థలలో ఒకటైన ఇన్ఫోసిస్ ఈసారి ప్రాంగణ నియామకాలు ఉండవంటూ ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తన సంస్థ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఉద్యోగులకు పనితీరు ఆధారంగా 80 శాతం వెరియబుల్ పే చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఈ బోనస్‌కు అందరూ అర్హులు కారని పేర్కొంది. కంపెనీ ప్రకటన ప్రకారం లెవెల్ 9 లేదా అంతకంటే దిగువ స్థాయి ఉద్యోగులకు సగటున 80 శాతం వేరియబుల్ పే ఇవ్వనుంది. ఈ మేరకు ఉద్యోగులకు సంస్థ ఈమెయిల్ పంపించింది. జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఉద్యోగుల పనితీరు, సంస్థలో నిర్వహించిన పాత్రను బోనస్‌లు ప్రతిబింబిస్తాయని తెలిపింది. బోసన్ పంపిణీని యూనిట్ మేనేజర్లు నిర్ణయిస్తారని పేర్కొంది.
కాగా, ‘ వారానికి 70 పనిగంటలు’ సూచనతో ఇటీవల సంచలనం స్పృష్టించిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తాజాగా వ్యాపారవేత్తగా మారడం కష్టంతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. ‘‘సాప్ట్‌వేర్ ఇంజినీర్, లేదా ఫైనాన్షియల్ ఎనలిస్ట్ కావడం సులభమే కానీ పారిశ్రామికవేత్తగా కొనసాగడం కష్టంతో కూడుకున్నది. ఎంతో శ్రమ అవసరం. భారత్‌లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అయితే, దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు అనూకూల వాతావరణం కోసం భారత ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.





Untitled Document
Advertisements