మీ బాడీ షేప్ ఏది? మీ మెజర్మెంట్స్ మీరే కొలుచుకోవడం ఎలా ?

     Written by : smtv Desk | Tue, Jan 02, 2024, 04:15 PM

మీ బాడీ షేప్ ఏది? మీ మెజర్మెంట్స్ మీరే కొలుచుకోవడం ఎలా ?

ఇదివరకటి రోజులలో వయసుని బట్టి వేసుకునే దుస్తువులు ఎంపిక చేసుకునే వారు. కానీ నేడు వయసుతో సంబంధం లేకుండా ఎవరికి అనుకూలంగా ఉండే దుస్తువులను వారు ధరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే అన్నీ దుస్తువులు అందరికి నప్పవు. మన ఎత్తు, బరువు మరియు శరీర రంగుని బట్టి మనం దుస్తువులను ఎంపిక చేసుకుంటే మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాము. మనం దుస్తువులను ఎంపిక చేసుకునే ముందు మన బాడీ షేప్ ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

బాడీ షేప్ అనేది ముఖ్యంగా నాలుగు భాగాల యొక్క కొలతల మీద ఆధార పడి ఉంటుంది. అవి భుజాలు, ఛాతీ భాగం, నడుము ఇంకా తుంటి ( హిప్ ) భాగాలు అని చెప్పవచ్చు. ఈ భాగాలను ఆధారంగా చేసుకుని మన శరీర ఆకారాన్ని గూర్చి తెలుసుకోవచ్చు. బాడీ షేప్ లో చాలా రకాలే ఉన్నాయి కానీ అందులో ముఖ్యంగా రెక్టాంగిల్, ట్రైయాంగిల్, ఇన్వర్టెడ్ ట్రైయాంగిల్, అవర్ గ్లాస్, ఓవల్ అనేవి సాధారణంగా కనిపించే కొలతలు.

శరీర కొలతలు తీస్కునేటప్పుడు మీ ఒంటి మీద లూజ్ బట్టలు కాకుండా మీకు సరిగ్గా సరిపోయే తేలిక పాటి దుస్తులు ఉండేటట్లు చూస్కోండి. వర్క్ చీరలు, లేహంగల్లాంటి బరువైన దుస్తులు ధరించకండి వాటి వల్ల మీ శరీర కొలతల్లో తప్పులు దొర్లే అవకాశాలు ఉన్నాయి. శరీర కొలతలు టైలర్ తో కానీ మరెవరి చేతైనా కానీ తీయించుకోవడం మంచిది అలా కాకుండా మనమే స్వయంగా కొలతలు తీస్కోవాలి అంటే ఏం చేయాలో చూద్దాం.

ముందుగా ఒక కాగితం తీస్కుని మీరు కొలవాలి అనుకుంటున్న భాగాల పేర్లు రాసి పెట్టీ ఉంచండి ఆ తరువాత మెజరింగ్ టేప్ తీసుకుని నిలువుటద్దం ముందు వెనక్కి తిరిగి నిలబడి ఆ భుజం నుండి ఈ భుజం వరుకు కొలుచుకోవాలి. సరైన కొలత తెలిసినా తరువాత మీ చూపుడు వేలుని ఆ సంఖ్య దగ్గర పెట్టి కొంచం మెడను వెనక్కి ఒంచి అద్దంలో చూస్తే మీకు తెలిసిపోతుంది. ఆ కొలతను కాగితం మీద రాసి పెట్టండి.అదే విధంగా ఛాతీ భాగం కొలతలు తీస్కోవాలి.

ఇక నడుము భాగం దగ్గర కొలతలు తీస్కునేటప్పుడు మీకు ఎక్కడ కొలవాలో తెలియకపోతే మీరు కొంచం పక్కకి ఒంగినట్లతే మడతలా వచ్చిన దగ్గర మీ నడుము కొలత దగ్గర తీస్కోవచ్చు.

ఇక చివరిగా తుంటి భాగం దగ్గరకి వచ్చినట్లయితే మీ రెండు కాళ్ళను దగ్గరగా చేసి నిలబడి ఆ భాగంలో ఎక్కడైతే కొంచం వెడల్పుగా కనిపిస్తుందో అక్కడ కొలత తీసుకుంటే సరే.

కొలతలు తీయడం అయ్యాక ఆ కొలతల ఆధారంగా చేసుకుని మన శరీర ఆకారాన్ని ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

1. అవర్ గ్లాస్:- మీ భుజాలు, ఛాతీ, ఇంకా తుంటి భాగాలు సమానంగా ఉండి మీ నడుము భాగం సన్నగా ఉన్నట్లైతే మీది అవర్ గ్లాస్ ఫిగర్ అని చెప్పవచ్చు.
2. పియర్/ ట్రైయాంగిల్ షేప్:- మీ భుజాలు, ఛాతీ, నడుము భాగాలు సన్నగా ఉండి మీ తుంటి భాగం కొంచం ఎక్కువగా ఉంటే మీది ట్రైయాంగిల్ బాడీ షేప్ గా పరిగణించవచ్చు.
3. ఇన్వర్టెడ్ ట్రైయాంగిల్ షేప్:- ఒకవేళ మీ భుజాలు వెడల్పుగా ఉండి మిగిలిన భాగాలు సన్నగా ఉన్నట్లైతే మీది ఇన్వర్టెడ్ ట్రైయాంగిల్ షేప్.
4. రెక్టాంగిల్:- ఒకవేళ మీ భుజాలు, ఛాతీ, నడుము, తుంటి భాగాలు అన్నీ సమాంతరంగా ఉన్నట్లైతే మీది రెక్టాంగిల్ బాడీ షేప్.
5. ఓవల్ షేప్:- ఒకవేళ మీ నడుము భాగం కొంచం వెడల్పుగా అంటే పొట్ట దగ్గర కొంచం ఎత్తుగా ఉండి అన్య భాగాలు సన్నగా ఉంటే బాడీ షేప్ ఓవల్.

ఈసారి బట్టలు కొనేటప్పుడు మీ శరీర ఆకారాన్ని తెలుసుకుని దాని బట్టి కొనండి.





Untitled Document
Advertisements