లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు.. మూడు రోజుల తరువాత లాభాలు

     Written by : smtv Desk | Fri, Jan 19, 2024, 04:35 PM

 లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు.. మూడు రోజుల తరువాత లాభాలు

గత కొన్ని రోజుల నుండి నష్టాలే తప్ప లాభాలు అనే లేకుండా సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల బాట పట్టాయి. నేటి ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో లాభాలలో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 496 పాయింట్లు లాభపడి 71,683కి చేరుకుంది. నిఫ్టీ 160 పాయింట్లు పెరిగి 21,622 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (-3.52%), ఎన్టీపీసీ (-3.04%), టెక్ మహీంద్రా (-2.56%), టాటా స్టీల్ (-2.43%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.38%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.24%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.08%), కొటక్ బ్యాంక్ (-0.66%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.10%).






Untitled Document
Advertisements