కేంద్ర బడ్జెట్ ముంగిట వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల పెంపు

     Written by : smtv Desk | Thu, Feb 01, 2024, 11:53 AM

 కేంద్ర బడ్జెట్ ముంగిట వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల పెంపు

కేంద్ర మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆర్ధిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. లోక్ సభ ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం చివరి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టి అరుదైన ఘనత సాధించారు.
అయితే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు.. ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగాయి. ఒక్కో సిలిండర్ పై రూ. 14 పెంచారు. ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1,769.50కి చేరుకుంది. స్థానిక పన్నులను బట్టి ఈ ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఇప్పటి నుంచి సిలిండర్ బుక్ చేసుకునే వారు పెరిగిన ధరను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరలను మాత్రం పెంచలేదు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను చివరిసారిగా మార్చ్ 1వ తేదీన మార్చారు.





Untitled Document
Advertisements