వాకింగ్ చేసేటప్పుడు మన శరీరంలో జరిగేది ఇదే!

     Written by : smtv Desk | Fri, Feb 02, 2024, 08:55 PM

వాకింగ్ చేసేటప్పుడు మన శరీరంలో జరిగేది ఇదే!

మారిన జీవన శైలీ కారణంగా వీరు వారు అని లేకుండా ప్రతి ఒక్కరు కూడా రోజుకు 30 నిమిషాలపాటు నడవడం అనేది అలవ్టుగా మార్చుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా హాయిగా జీవించవచ్చు. లేదంటే ఉబకాయంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు ఎద్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కూర్చుని జాబ్ చేసే వారు రోజులో మినిమంగా 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం చాలా అవసరం అన్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు కూడా 30 నిమిషాలకు తగ్గకుండా వాకింగ్ చేయడం ద్వారా శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. అవి మానసిక మరియు శారీరక సమస్యలను తగ్గిస్తాయి.
వయసు పెరుగుతున్న వారికి వచ్చే దెమెంతియా, అల్జీమర్స్ వంటి సమస్యలను కూడా రోజూ 30 నిమిషాల వాకింగ్ తో దరి చేరనివ్వకుండా చూసుకోవచ్చు. హైబీపీ మరియు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది.
వాకింగ్ చేస్తున్న సమయంలో ఎక్కువ ఆక్సీజన్ గ్రహిస్తూ ఉంటాం. తద్వారా ఆ ఆక్సీజన్ రక్తంలో చేరి ఊపిరి తిత్తులకు అందుతుంది. అలా రక్తం మరింత శుద్ది అవ్వడంతో పాటు ఊపిరితిత్తుల్లో ఉండే విష మరియు వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లి పోతాయి.
షుగర్ సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు వాకింగ్ చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటుంది. వాకింగ్ తో పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. జీర్ణ పక్రియ పెరగడంతో పాటు బరువు పెరిగే సమస్యను అధిగమించవచ్చు. వాకింగ్ చేస్తున్న సమయంలో కండరాల దృఢంగా మారుతాయి. తద్వారా పెద్ద వయసులో కూడా కీళ్ల నొప్పులు ఇతర నొప్పులు లేకుండా ఉండవచ్చు. ఎముకల్లో ఉండే సాంద్రత పెరగడం వల్ల చిన్న ప్రమాదంకి కూడా ఎముకలు విరిగే పరిస్థితి ఉండదు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుక తప్పకుండా ప్రతి రోజు 30 నిమిషాలు వాకింగ్ చేస్తారని ఆశిస్తున్నాం.





Untitled Document
Advertisements