ప్రేమించిన వారికి మనసులోని ప్రేమ తెలిపే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి..

     Written by : smtv Desk | Thu, Feb 08, 2024, 07:08 AM

ప్రేమించిన వారికి మనసులోని ప్రేమ తెలిపే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి..

ఫిబ్రవరీ మాసం అంటే ప్రేమికుల మాసం అంటారు. ఎంతో కాలంగా ఒకరిపై ప్రేమని పెంచుకుంటూ వచ్చిన వ్యక్తులు ఈ నెలలోనే తమ ప్రేమను ప్రేమించిన వ్యక్తి తెలిపి ఆ వ్యక్తి మనసులోని ఫీలింగ్ కూడా తెలుసుకుంటారు. అయితే ప్రపోజ్ చేయాలి అనే ప్రతి ఒక్కరు కూడా కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని ప్రపోజ్ చేస్తే మంచిదట . అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం

* ఎవరైనా ప్రపోజ్ చేయడం ఈజీనే. ఆ తర్వాత గొడవలు రాకుండా ఉండాలంటే ముందుగానే మీ పార్టనర్ తో కచ్చితంగా ఫ్యూచర్ గురించి డిస్కస్ చేయండి. ఆ తర్వాత ఓ సరైన ప్లాన్ ప్రకారం లైఫ్ ని డిజైన్ చేసుకుని ప్రపోజ్ చేయండి.

* ఇక మీ ప్రేమని వ్యక్తం చేసేటప్పుడు రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే చాలా మంచిది. దీని వల్ల ఎదుటి వారు హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా. అదే విధంగా, అందరిలా కాకుండా మీకంటూ ఓ ప్రత్యేక విధంగా ప్రపోజ్ చేయడం మంచిది. దీని వల్ల లైఫ్ లాంగ్ ఆ ప్రపోజల్ గుర్తుంటుంది.

* కొంతమందికి అందరి ముందు ప్రపోజ్ చేయడం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు అందరి ముందు కాకుండా మీరిద్దరు ఉన్నప్పుడే ప్రపోజ్ చేయండి.

* ప్రపోజ్ చేయడం బానే ఉంటుంది. కానీ, ఆ బాధ్యతని జీవితాంతం హ్యాపీగా స్వీకరించాలి. ఇందుకోసం సరైన విధంగా ప్రపోజ్ చేయండి. ఫ్యూచర్ ప్లాన్ సరిగ్గా ఉండేలా చూసుకోండి. నిజాయితీగా ఉండండి. ఏవేవో కలలు కనకుండా, వాస్తవికంగా ఉండేలా మాట్లాడండి.

* ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలసిన విషయం మీరు ఎంచుకున్న వ్యక్తితో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా జీవితాంతం కలిసి ఉండగలరా లేదా అనే విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం.





Untitled Document
Advertisements