ఈ నూనే రాస్తే మీ జుట్టు పెరగడం కాయం

     Written by : smtv Desk | Wed, Feb 14, 2024, 11:15 PM

 ఈ నూనే రాస్తే మీ జుట్టు పెరగడం కాయం

ఎవరైనా పొడవైన జుట్టు ఉన్న అమ్మాయి మన ముందు నుండి నడుచుకుంటూ పోతే అయ్యో నాకు అంత పొడవైన జుట్టు లేదే అని నిరాశాపడుతుంటాము. అలాగే జుట్టు పెంచుకోవడం కొరకు అనేక ప్రయత్నాలు సైతం చేస్తూ ఉంటాము. కాని ప్రయత్నం మాత్రం శూన్యం.
నిజానికి మునపటి కాలంలో మన అమ్మమ్మలు వాళ్ళు జుట్టుకి రోజు నూనె రాసేవారు. అప్పట్లో వాళ్ళ జుట్టు ఒత్తుగా, బలంగా, నల్లగా, పట్టు కుచ్చులా ఉండేది. కానీ ఇప్పుడు మన దగ్గరకి వచ్చేసరికి షాంపూ, కండిషనర్, సెరం, కేరాటిన్ ట్రీట్మెంట్ అంటూ అబ్బో చాలానే వాడుతూ ఉంటాము. ఇన్ని వాడిన సరే మన జుట్టు పెరగడం మాట అటు ఉంచితే రాలుతూనే ఉంది. అలా కాకుండా ఉండాలంటే మన జుట్టుకి సరైన పోషణ ఇవ్వాలి. అందుకోసం ఈ నూనెల్లో ఏదైనా వాడచ్చు.

భృంగరాజ్ నూనె:- భృంగరాజ్ చాలా శ్రేష్ఠమైంది. ఇది జుట్టుకు మంచి పోషణ ఇవ్వడంతో పాటు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. రాలిపోయిన జుట్టు తిరిగి మొలిచెందుకు సహాయపడుతుంది. మంచి ఫలితాల కోసం రెండు రోజులకు ఒకసారి ఉపయోగించడం మంచిది.

ఆముదం:- జుట్టు పెరుగుదలకు విటమిన్ ఈ చాలా ముఖ్యమైనది. ఇది అముదంలో పుష్కలంగా ఉండటం వల్ల జుట్టుకి తేమను అందించి మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆముదం రాయడం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.

బాదం నూనె:- బాదం నూనెలోని సంగ్రహాలు జుట్టుకు చాలా మంచివని నిపుణులు చెప్తున్నారు. బాదం నూనెలో ఉండే మెగ్నీషియం మరియు విటమిన్ ఈ మీ జుట్టుకు చాలా మంచిది. ఇది జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగకరం. ఒకవేళ మీ జుట్టు మరి పొడిగా ఉన్నట్లైతే మీరు తినే బాదం నూనెలో తీస్కోవడం వల్ల మీ జుట్టుకు తేమ అంది జుట్టు పొడిబారకుండా ఉంటుంది.

నువ్వుల నూనె:- ఇతర హెయిర్ గ్రోత్ ఆయిల్స్ లానే, నువ్వుల నూనెలో కూడా విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. నువ్వుల నూనెను జుట్టు పెరుగుదలకు అనేక ఆయుర్వేద నివారణలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనె జుట్టు పెరుగుదలను పెంచుతుంది మరియు జుట్టు తిరిగి పెరగేందుకు బాగా తోడ్పడుతుంది.

టీ ట్రీ ఆయిల్:- టీ ట్రీ ఆయిల్ యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీమైక్రోబయల్ కలిగి ఉంటుంది. ఇది జుట్టు తాలూకా ఫోలికల్స్ ను అన్లాక్ చేయడంలో మరియు మూలాల నుండి పోషణలో సహాయపడుతుంది. ఇది చుండ్రును నివారించడంలో సహాయపడుతుంది.

ఆర్గాన్ ఆయిల్:- మిగతా నూనెలతో పోలిస్తే ఆర్గాన్ ఆయిల్ తక్కువ ప్రాసెసింగ్ తో తయారు అవుతుంది. ఇది మీ జుట్టు సమస్యలకు ఉత్తమ పరిష్కారంగా చేస్తుంది. ఇందులో విటమిన్ ఈ మరియు యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి, ఇది జుట్టు యొక్క పోషకాలను పునరుద్ధరించడంలో మరియు తిరిగి నింపడంలో సహాయపడుతుంది. పొడి మరియు చిట్లిన జుట్టు ఉన్నవారికి ఈ నూనె చాలా మంచిది.

పైన చెప్పిన నూనేలలో మీకు నచ్చిన ఏదైనా ఒక నూనే లేదా వాటిని కలిపిగాని వాడుకోవచ్చు. తరుచుగా జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు నూనే పట్టిస్తుంటే చక్కగా పెరుగుతాయి.





Untitled Document
Advertisements