ప్రింట్స్ ఫ్యాబ్రిక్ ఎంచుకునేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు..

     Written by : smtv Desk | Thu, Feb 22, 2024, 09:55 AM

ప్రింట్స్ ఫ్యాబ్రిక్ ఎంచుకునేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు..

మనం రోజువారి అవసరాలకు తగ్గట్టు రకరకాల దుస్తువులను ఎంచుకుంటాము. చీరలు, డ్రెస్సులు, జీన్స్ ఇలా చాలా రకాలు ఉంటాయి. అయితే వీటిల్లో కొన్ని సాలిడ్, ప్రింట్స్, స్ట్రిప్స్ ఇలా ఒక్కో డ్రెస్ పైన ఉండే డిజైన్స్, ప్రింట్స్ బట్టి అవి వేసుకున్నప్పుడు మన లుక్ కూడా మారిపోతూ ఉంటుంది. ప్రింట్ ఫ్యాబ్రిక్స్ మీద మనకి కొంచం అవగాహన ఉండాలే కానీ ఎలాంటి బట్టనైనా మన ఒంటి తీరుకి నప్పేలా చేసుకుంటు అందంగా కనిపించవచ్చు. అలాగే ఈ ప్రింట్స్ ఎంచుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే మనం ఎప్పుడైనా సరే అందంగా కనిపించే అవకాశం ఉంది.

* మీరు ఏదైనా ప్రింట్స్ ఉన్న ఫాబ్రిక్ తీస్కునేటప్పుడు టాప్ అండ్ బాటమ్ సేమ్ బేస్ కలర్ ఉండేలా చూస్కోండి. అంటే ప్రింట్స్ లో చిన్న చిన్న తేడాలు ఉన్నా మీ డ్రెస్ రంగు మాత్రం ఒకటే ఉండేలా చూస్కోండి.

* ఒకవేళ మీకు సేమ్ బేస్ కలర్ ఉన్న ఫ్యాబ్రిక్ దొరకలేదు అనుకోండి అప్పుడు మీరు వాటిని సాలిడ్ కలర్ అంటే ప్లైన్ రంగు ఉన్న ఫ్యాబ్రిక్ తో జత చేయవచ్చు. అది ఎలా అంటే మీ టాప్ ఆర్ బాటమ్ ప్రింట్స్ ఉన్నది తీస్కున్నట్లైతే మిగిలినది ప్లెయిన్ తీస్కొండి.

* ఒకవేళ మీకు రెండు సేమ్ బేస్ కలర్ ఉన్న ఫ్యాబ్రిక్స్ దొరకనట్లైతే అప్పుడు మీరు సేమ్ ఫ్యామిలీ కలర్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి బ్లూ తీస్కుంటే దాని షేడ్స్ తో లైక్ లైట్ బ్లూ, నేవి బ్లూ ఇలా కొంచం దగ్గరగా ఉన్న రంగులతో జత చేయవచ్చు.

* ఒకవేళ మీరు మొత్తంగా స్ట్రైప్స్ లేదా డాట్స్ ప్రింట్స్ తీస్కొవాలి అన్న ఆలోచనలో ఉంటే మాత్రం మీరు తీస్కునే టాప్ లేదా బాటమ్ పై డిజైన్ ఒకటే ఉన్నప్పటికి వాటి ప్లేస్ లేదా వాటి మధ్య ఉండే దూరం ఇలా చిన్న చిన్న వ్యత్యాసాలు ఉండేలా చూస్కోండి. ఇలా సెలక్ట్ చేసుకోవడం వల్ల మీ డ్రెస్ అంత ఎబ్బెట్టుగా కనిపించకుండా ఉంటుంది.

* అలాగే మీరు ఏదైనా జామెట్రిక్ ప్రింట్స్ ఉదాహరణకి సర్కిల్స్, ట్రైయాంగిల్స్ లాంటివి తీస్కోవాలి అనుకుంటున్నట్టు అయితే మీ టాప్ పై చిన్న ప్రింట్స్ ఉండి మీ బాటమ్ పై పెద్ద ప్రింట్స్ ఉండేలా చూస్కోండి.

* ఒకవేళ మీరు టాప్ అండ్ బాటమ్ సేమ్ కలర్ ప్రింట్స్ తీస్కునే ఉద్దేశ్యంలో ఉన్నట్లైతే అప్పుడు మీ బేస్ కలర్ ని తారుమారు చేయండి అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు వైట్ టాప్ మీద బ్లాక్ డాట్స్ ఉన్న ఫ్యాబ్రిక్ తీస్కుంటే బాటమ్ బ్లాక్ బేస్ ఉండి వైట్ డాట్స్ ఉండేలా చూస్కోండి.

* మీరు రెండు ఓకే రంగు లేదా దగ్గర దగ్గర రంగులున్న ఫ్యాబ్రిక్స్ కాకుండా రెండు వేరు వేరు రంగులు తీస్కోవాలి అనుకుంటే మాత్రం అందులో ఒకటి బ్రైట్ గా ఉన్నది రెండవది న్యూట్రల్ కలర్ ఉన్నది తీస్కోవడం మంచిది. ఈ రకంగా ఒక మంచి మల్టీ కలర్ డ్రెస్ ఎంచుకోవచ్చు.

ఈసారి మీరు ప్రింట్ ఫ్యాబ్రిక్ కొనాలి అనుకుంటే ఈ జాగ్రత్తలు గనుక పాటిస్తే మీ డ్రెస్సింగ్ లో మీరే బెస్ట్ డిజైనర్ అయిపోతారు. కచ్చితంగా ప్రతి ఒక్కరు మీ సెలెక్షన్ ని మెచ్చుకుంటారు.

Untitled Document
Advertisements