మరో కొత్త ప్రయోగం దిశగా ఎలాన్ మస్క్.. జీమెయిల్ కు పోటీగా ఎక్స్ మెయిల్

     Written by : smtv Desk | Sat, Feb 24, 2024, 07:17 AM

మరో కొత్త ప్రయోగం దిశగా ఎలాన్ మస్క్.. జీమెయిల్ కు పోటీగా ఎక్స్ మెయిల్

ఇంటర్నెట్ వాడుతున్న ప్రతి ఒక్కరికి జీమెయిల్ సుపరిచితమే. జీమెయిల్ అనేది మనిషి జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ వినియోగించాలి అంటే జీమెయిల్ వినియోగించాల్సిందే. అయితే ఇంటర్నెట్ మెసేజింగ్ రంగంలో ఇప్పటివరకు జీమెయిల్ స్థానం చెక్కుచెదరకుండా ఉంది. కానీ, గూగుల్ జీమెయిల్ కు పోటీగా ఎక్స్ మెయిల్ పేరిట సరికొత్త ప్రత్యామ్నాయ ఈమెయిల్ ను తీసుకువచ్చేందుకు ఎలాన్ మస్క్ సన్నద్ధమవుతున్నారు. త్వరలోనే ఎక్స్ మెయిల్ రంగప్రవేశం చేయనుందని మస్క్ వెల్లడించారు. కాగా, జీమెయిల్ ను గూగుల్ త్వరలోనే మూసివేస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 2024 ఆగస్టుతో జీమెయిల్ కు తెరదించేందుకు గూగుల్ నిర్ణయించుకుందని ఎక్స్ లో కొన్ని పోస్టులు దర్శనమిచ్చాయి. అయితే, గూగుల్ ఈ ప్రచారాన్ని కొట్టిపారేసింది. జీమెయిల్ ఎక్కడికీ పోదని, జీమెయిల్ ను మూసివేసే ఆలోచనేదీ తమకు లేదని స్పష్టం చేసింది. జీమెయిల్ కు ఎక్స్ మెయిల్ కు మధ్య తేడాలు ఏవిధంగా ఉండబోతున్నాయి అనే ఆసక్తి మొదలైంది యూజర్లలో .

Untitled Document
Advertisements