పొట్టిగా ఉండే అమ్మాయిలు డ్రెస్సింగ్ విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి !

     Written by : smtv Desk | Sat, Feb 24, 2024, 08:17 AM

పొట్టిగా ఉండే అమ్మాయిలు డ్రెస్సింగ్ విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి !

హైట్ తక్కువగా ఉండే అమ్మాయిలకు అన్ని రకాల బట్టలు అంతగా నప్పవు. కొన్ని రకాల దుస్తువులలో వారు మరింత పొట్టిగా కనిపించే అవకాశం ఉంది. అయితే పొడవుగా కనిపించాలనే ఉద్దేశ్యంతో హై హీల్స్ లేదా పాయింట్ హీల్స్ లాంటివి వాడుతూ ఉంటారు. కొంతసేపటి వరుకు హీల్స్ వేసుకుంటే పర్లేదు కానీ రోజంతా వేసుకోవడం వల్ల అరికాళ్ళు, మడమలు నొప్పి పుట్టడమే కాక అవి అరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. కాబట్టి ఇలా హీల్స్ వాడకుండా మీ డ్రెస్సింగ్ స్టైల్స్ లో కొన్ని మార్పులు చేయడం ద్వారా మీరు వేసుకున్న డ్రెస్ లో పొడవుగా కనిపించేలా చేయచ్చు. ఆ టిప్స్ ఎంటో చూద్దాం.

- మీరు ఎప్పుడైనా ఏ బట్టలు కొనేటప్పుడు అయినా సరే గుడ్డిగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మీ బాడీని 50-50 గా కాకుండా 40-60 గా అంటే మీ అప్పర్ బాడీ 40 అండ్ మీ లోవర్ 60 పర్సెంట్ ఉన్నట్టు కనిపించేలా ఉండే డ్రెస్సెస్ తీస్కొండి.

- మీరు వేసుకునే ఏ కుర్తీ అయిన సరే మీ మోకాలి కంటే కిందకి అంటే పిక్కల వరుకు ఉండేలా చూస్కోవడం వల్ల చూసేవాళ్ళకి మీరు పొడవుగా కనిపిస్తారు. అలా కాకుండా మీ కుర్తీ మోకాలు అంతకంటే పైకి ఉన్నట్లైతే మీరు పొట్టిగా కనిపిస్తారు. అలా కాకుండా పొడవుగా ఉన్న కుర్తీ ఎంచుకోవడం వల్ల ఎదుటివారికి మీరు పొడవుగా ఉన్నారని భ్రాంతిని కలిగించవచ్చు.

- రెండవది మీరు ప్లాజోస్, ట్రౌజర్స్ లాంటివి సెలెక్ట్ చేసుకునేటప్పుడు హై వెయిస్ట్ ఉన్నవి ఎంచుకోవడం మంచిది. దీని వల్ల మీ కాళ్ళు పొడవుగా ఉన్నట్లు కనిపించడమే కాకుండా మీరు పొడవుగా కనిపించేలా చేస్తుంది. అదే ఎప్పటిలా నడుము వరుకే ఉన్న ప్యాంట్స్ ప్రిఫర్ చేస్తే కనుక మీరు మరింత పొట్టిగా కనిపిస్తారని గుర్తుంచుకోండి.

- తక్కువ హైట్ ఉన్న అమ్మాయిలు మొనోక్రోమ్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. మోనోక్రోమ్ అంటే పై నుండి కింద వరుకు కూడా ఓకే రంగు గల టాప్, దుప్పట్ట, బాటం వేసుకోవడం వల్ల మీ బాడీ పార్ట్స్ కొంచం పొడవుగా అనిపించి మిమ్మల్ని పొడవుగా చేసి చూపిస్తుంది. వీలైతే మీరు వేసుకునే చెప్పులు కూడా సేమ్ కలర్ ఉండేలా లేదా మీ స్కిన్ టోన్ కి దగ్గరగా ఉండేలా చూస్కోండి.

- జీన్స్, టీషర్ట్, షర్ట్స్, ప్లాజోస్ లేదా ఫార్మల్ వేర్ లాంటివి అది కూడా హై వేయిస్ట్ బాటం వేసుకున్నప్పుడు మీరు మీ టాప్ ని టక్ చేయడం వల్ల మీరు చూసేందుకు మీరున్న హైట్ కన్నా కొంచం పొడవుగా కనిపిస్తారు.

- మీరు డ్రెస్ వేసుకున్నా సరే మీ మొత్తం ఒళ్లంతా కప్పేసేలా వేసుకోకండి దాని వల్ల మీ అవయవాలు పొట్టిగా కనిపిస్తాయి. అలా కాకుండా బ్రాడ్ నెక్ లేదా డీప్ నెక్ కానీ, ఒకవేళ స్లిట్ ఉన్న కుర్తీ వేసుకున్నట్లైతే హై స్లిట్ ఉండేలా చూస్కోండి. అదే మీకు బాడీ అంతా కవర్ అయ్యే ఉండేలా డ్రెస్ వేసుకోవడం ఇష్టమైతే కనీసం మీ స్లీవ్స్ అయినా ఫుల్ గా కవర్ ఉండేలా కాకుండా ఎల్బో హ్యాండ్స్ ఉండేటట్టు చూస్కోండి.

- అలాగే మీరు బాటమ్ ఎంచుకునేటప్పుడు సన్నగా ఎలాంటి ఫ్లెయిర్ లేకుండా ఉన్నవి ఎంచుకోవడం మంచిది దాని వల్ల మీ కాళ్ళు పొడవుగా కనిపిస్తాయి.

ఈ టిప్స్ ఫాలో అయితే మీరు పొట్టిగా కాకుండా కాస్త పొడవుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది చూసేవారికి

Untitled Document
Advertisements