తగ్గిన వెండి, బంగారం ధరలు.. ఎంతంటే?

     Written by : smtv Desk | Mon, Mar 11, 2024, 12:27 PM

తగ్గిన వెండి, బంగారం ధరలు.. ఎంతంటే?

ప్రస్తుతం పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది. పెళ్ళి అంటే కచ్చితంగా వెండి, బంగారం కొనాల్సిందే. బంగారం కొనాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే తాజాగా మల్టీ కమోడిటీ ఎక్స్‌చేంజ్‌లో వరుసగా రెండోరోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఏప్రిల్ 5తో ముగిసే గోల్డ్ ఫీచర్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 8 (0.01 శాతం) తగ్గి రూ. 66,015గా ఉంది. అంతకుముందు రూ. 66,023 వద్ద ముగిసింది.
మే 3తో ముగిసే సిల్వర్ ఫీచర్స్‌లో వెండి ధర రూ. 77 (0.10శాతం) తగ్గి కిలో రూ. 74,185గా నమోదైంది. అంతకుముందు దాని ధర రూ. 74,262 వద్ద ముగిసింది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 22 కేరెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,900గా ఉండగా, వెండి ధర కేజీ రూ. 75,600గా ఉంది. ముంబైలో వీటి ధరలు వరుసగా రూ. 60,750, రూ. 75,600, కోల్‌కతాలో రూ. 60,750, రూ. 75,600, చెన్నైలో రూ. 61,500, రూ. 79,000గా ఉన్నాయి.





Untitled Document
Advertisements