సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో సంవత్సరానికి కనీసం రూ.250 జమ చేయకుంటే జరిగేది ఇదే

     Written by : smtv Desk | Tue, Mar 12, 2024, 03:26 PM

సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో సంవత్సరానికి కనీసం రూ.250 జమ చేయకుంటే జరిగేది ఇదే

మధ్య తరగతి కుటుంబాలలో ఆడపిల్ల పుట్టింది అంటే తల్లిదండ్రులకు గుండెలో భయం మొదలవుతుంది . మనకు వచ్చే సంపాదనతో ఎలా పోషించాలి . ఎలా పెళ్ళి చేయాలి అని భాధపడుతుంటారు . ఆ అవసరం లేకుండా మన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారు చేపట్టిన బేటీ బచావో బేటియో పఢావో' లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో ఆడపిల్లల ఉన్నత చదువు కోసం , వారి భవిష్యత్ కోసం సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకంలో ఆడపిల్లల తల్లిదండ్రుల వారు సంపాదించే సంపాదనలో కొత్త భాగం దాచి పెట్టుకోవచ్చు . అంతేకాకుండా ధనవంతులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఈ పథకంలో సంవత్సరానికి రూ.1.50,000 పన్ను మినహాయింపు పొందవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో వడ్డీ రేటును 8.2 శాతంగా చెల్లిస్తుంది. ఈ SSY వడ్డీ రేటు ప్రతి త్రైమాసికంలో మారవచ్చు కానీ మెచ్యూరిటీ సమయంలో దాదాపు 8 శాతం నికర రాబడిని ఆశించవచ్చు.

సుకన్య సమృద్ది యోజన పథకం ఖాతా పోస్టాఫీస్ లో తెరవచ్చు. ఈ పథకంలో మీరు నెలనెలా జమ చేయవచ్చు లేదా రెండు లేదు మూడు నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి జమ చేయవచ్చు. సంవత్సరంలో రూ.1,50,000 జమ చేసే వరకు ఎన్నిసార్లైనా ఖాతాలో డబ్బు జమ చేయవచ్చు. ఈ ఫథకంలో సంవత్సరానికి కనీసం రూ.250 జమ చేయాలి. గరిష్ఠంగా రూ.1,50,000 జమ చేయవచ్చు. ఇలా చేయడం వలన మనకు తెలియకుండానే చిన్న మొత్తంలో పొదుపు చేస్తూ ఉంటాము . దీని వలన ఆ అమ్మాయికి 21 ఏళ్లు వచ్చేసరికి దాదాపు రూ.69 లక్షలు వస్తాయి. ఆడపిల్ల చదువు కోసం ఏమైనా అవసరం అయితే ఆ అమ్మాయికి 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య మెచ్యూరిటీ మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మెచ్యూరిటీ మొత్తాన్ని ఆడపిల్లకి 21 ఏళ్లు వచ్చినప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన ఫథకంలో సంవత్సరానికి కనీసం రూ.250 జమ చేయకుంటే ఖాతా ఇన్ యాక్టివ్ అవుతుంది. ఈ ఖాతా ఉన్నవారు ఇప్పటికీ కూడా కనీసం రూ.250 కూడా చెల్లించకపోతే.. మార్చి 31 లోపు రూ.250 చెల్లించాలి. లేకుంటే ఖాతా ఇన్ యాక్టివ్ అవుతుంది.ఇప్పటికి ఈ ఖాతా ఓపెన్ చేయని ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే మేల్కొని పోస్ట్ ఆఫీసులో ఓపెన్ చేయండి . దీనికి ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది. మనం ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేయవచ్చు ప్రతిసారి పోస్ట్ ఆఫీసుకి వెళ్ళవలసిన అవసరం లేదు .





Untitled Document
Advertisements