కూలిన 'తేజస్' యుద్ధ విమానం.. రాజస్థాన్ లో ఘటన

     Written by : smtv Desk | Tue, Mar 12, 2024, 04:47 PM

కూలిన 'తేజస్' యుద్ధ విమానం.. రాజస్థాన్ లో ఘటన

రాజస్థాన్ లోని జైసల్మేర్ వద్ద యుద్ధం 'తేజస్' కూలిపోయింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ తేలికపాటి పోరాట విమానం రోజువారీ శిక్షణ సమయంలో ఘటన జరిగింది. ప్రమాదాన్ని ముందే గ్రహించిన పైలెట్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ మేరకు భారత వాయుసేన ఓ ప్రకటనలో తెలిసింది. వాయుసేన ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
భారత్ యుద్ధ విమానాల కోసం రష్యాపై అధికంగా ఆధారపడుతుందన్న విషయం తెలిసిందే. భారత్ అమ్ములపొదిలో ప్రధాన అస్త్రాలైన సుఖోయ్, మిగ్ యుద్ధ విమానాలు రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవే. అయితే, రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలన్న నేపథ్యంలో, 1984లో ఎల్సీఏ (తేలికపాటి పోరాట విమానం) ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 'తేజస్' పేరిట ఈ ప్రాజెక్టును చేపట్టింది. 'తేజస్' యుద్ధ విమానం సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది.





Untitled Document
Advertisements