నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

     Written by : smtv Desk | Fri, Mar 15, 2024, 05:02 PM

నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేటి ఉదయం నష్టాల నడుమ ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు రోజు గడిచేసరికి చివరకు నష్టాలను మూటకట్టుకున్నాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు కీలక వడ్డీ రేట్లు తగ్గింపుపై నీలిమేఘాలు కమ్ముకునేలా చేశాయి. అమెరికా పరిస్థితుల కారణంగా ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. మన మార్కెట్లు కూడా అదే బాటలో నడిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 453 పాయింట్లు నష్టపోయి 72,643కి పడిపోయింది. నిఫ్టీ 123 పాయింట్లు కోల్పోయి 22,023 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (2.10%), బజాజ్ ఫైనాన్స్ (1.89%), మారుతి (0.71%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.37%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.30%).

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-4.75%), టాటా మోటార్స్ (-2.23%), ఎల్ అండ్ టీ (-1.97%), ఎన్టీపీసీ (-1.94%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.91%).





Untitled Document
Advertisements