మీ జుట్టు ఊడిపోతుందా?.. షాంపులో ఇది కలిపి తలస్నానం చేయండి

     Written by : smtv Desk | Sat, Mar 23, 2024, 12:35 PM

మీ జుట్టు ఊడిపోతుందా?.. షాంపులో ఇది కలిపి తలస్నానం చేయండి

ఆడపిల్లకి జుట్టే అందం. అలాంటి జుట్టుని కాపాడుకోవాలి పొడుగ్గా పెంచుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ, కొన్ని కారణాల వల్ల జుట్టు అనుకున్నట్లుగా పెరగదు, ఉన్న కాస్త జుట్టు కూడా ఊడిపోతుంటుంది. అలాంటప్పుడు కొన్ని చిన్న మార్పులతో మన జుట్టును ఊడిపోకుండా నిగనిగలాడేటట్లు పెరిగేలా చేసుకోవచ్చు.

తలస్నానం.. ఏ కాలంలోనైనా రెగ్యులర్‌గా తలస్నానం చేయాలి. దీనిని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మీ జుట్టుని చక్కగా క్లీన్ చేస్తుంటే అది హెల్దీగా మారుతుంది. అదే విధంగా, చలికాలంలో వచ్చే చెమటని కూడా దూరం చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా అయితే, వారానికి రెండు, మూడుసార్లు తలస్నానం చేసేవారు. కానీ, సమ్మర్‌లో అయితే 3 సార్లకంటే ఎక్కువగానే తలస్నానం చేయడం మంచిది.

జుట్టును ఒత్తుగా పెంచే చిట్కాలు:
​ఆయిల్ మసాజ్‌ అనేది జుట్టుకి ప్రాణం పోస్తుంది అని చెప్పొచ్చు. కాబట్టి, తలస్నానం చేసే ముందు ఎప్పుడు కూడా జుట్టుకి ఆయిల్ రాసి మసాజ్ చేయండి. దీని వల్ల డ్రై హెయిర్ సమస్య ఉండదు. జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. చాల మంది తెలియక జుట్టుకు ఆయిల్ పెట్టకుండా చేస్తుంటారు దీని వలన చుండ్రు సమస్య ఎక్కువ అవుతుంది .

హెన్నా: జుట్టుకి కండీషనింగ్ కూడా ముఖ్యమే. అందుకోసం నెలకోసారైనా జుట్టుకి హెన్నా అప్లై చేయండి. దీని వల్ల జుట్టుకి కండిషనింగ్ అంది బావుంటుంది. ఇందుకోసం ఆర్గానిక్ హెన్నాని ఎంచుకోండి.హెన్నాలో చాల రకాలు ఉన్నాయి . మీకు ఏది నచ్చితే అది వాడుకోవచ్చును.

అలొవెరా జెల్: జుట్టుని కాపాడడంలో అలొవెరా ముందుంటుంది. కాబట్టి, అప్పడప్పుడు అలొవెరా జెల్‌ని జుట్టుకి అప్లై చేయండి. 20 నిమిషాల పాటు ఉండి తర్వాత తలస్నానం చేయండి. దీని వల్ల జుట్టు మాయిశ్చరైజ్డ్‌గా మారి ఒత్తుగా పెరుగుతుంది.

కర్డ్ ప్యాక్.. జుట్టుకి అప్పుడప్పుడు పెరుగుతో ప్యాక్ వేయండి. ఇందుకోసం పుల్లటి పెరుగు, తాజా పెరుగు ఏదైనా మంచిదే. దీనిని తీసుకుని చక్కగా జుట్టుకి అప్లై చేసి 20 నిమిషాల పాటు అలానే ఉంచి మసాజ్ చేసి మైల్డ్ షాంపూతో క్లీన్ చేయాలి. వారానికి ఓ సారి చేస్తే జుట్టు మృదువుగా మారుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్: మీరు తలస్నానం చేసేటప్పుడు షాంపూలో కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి షాంపూ చేయండి. దీని వల్ల మీ స్కాల్ప్ హెల్దీగా మారుతుంది. చుండ్రు దూరమవుతుంది. రెగ్యులర్‌గా చేస్తే రిజల్ట్ ఉంటుంది.

అదే విధంగా, జుట్టుని కనీసం రెండు మూడు నెలలకి ఒక్కసారి అయినా చివర్లు కాస్తా కత్తిరించండి. దీని వల్ల చిట్లిపోవడం సమస్య తగ్గుతుంది.చాల మంది ఈ విషయం తెలియక కట్ చేయరు . అప్పుడు జుట్టు పెరగకుండా అలానే వుండి పోతుంది . ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ జుట్టు ను పొడవుగా పెంచుకోవచ్చును





Untitled Document
Advertisements