కేవలం రూ.8,200 ధరకే 5G స్మార్ట్‌ఫోన్‌ రిలయన్స్ సరికొత్త ఆవిష్కరణ

     Written by : smtv Desk | Sat, Mar 23, 2024, 12:53 PM

కేవలం రూ.8,200 ధరకే 5G స్మార్ట్‌ఫోన్‌ రిలయన్స్ సరికొత్త ఆవిష్కరణ

రిలయన్స్ సంస్థ వారు ఎప్పుడు ఏదో ఒక కొత్తధనాన్ని తీసుకురావడానికి చూస్తూ ఉంటారు . మొదట మొబైల్‌ఫోన్లను తయారు చేయడం కూడా ఈ కంపెనీ వారే స్టార్ట్ చేశారు . అయితే ఎప్పుడు కొత్తగా 5జీ టెక్నాలజీ మొబైల్స్ ను కూడా తీసుకురావడానికి చూస్తుంది . ఈ 5జీ టెక్నాలజీ భవిష్యత్తును శాసించనుంది. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఇంటర్నెట్‌ కంటే మరింత వేగంగా అందించేలా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు 5జీ టెక్నాలజీకి అనువుగా పనిచేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ సాంకేతికతకు సరిపడే మొబైల్‌ఫోన్లను కొనుగోలు చేయాలి. ఈ క్రమంలో నే రియలన్స్‌ జియో మరో అద్భుతానికి తెర తీస్తోంది. ఇప్పటికే అత్యంత తక్కువ ధరకే 4జీ ఫోన్‌ను తీసుకొచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన రియలన్స్‌ జియో , తాజాగా ఈ 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది.

అదికూడా చాల తక్కువ ధరకే రూ. 10వేలలోనే 5జీ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు రియలన్స్‌ సన్నాహాలు చేస్తోంది. తర్వలోనే ఈ ఫోన్‌ మార్కెట్లోకి రానుంది. భారత ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోతో కలిసి అమెరికాకు చెందిన సెమీకండక్టర్‌ సంస్థ క్వాల్‌కామ్ చిప్‌సెట్ కంపెనీ ఈ కొత్త జియో 5జీ ఫోన్ అభివృద్ధి చేస్తోంది. దీని ధర సుమారుగా 99 డాలర్ల లోపు (సుమారు రూ.8,200) ఉండనుంది. గిగాబిట్‌ 5జీ స్పీడ్‌కు కట్టుబడి ఉన్నామని చెబుతూ.. ఈ చిప్‌లో 2 యాంటెనా 5జీ స్టాండలోన్‌ (ఎస్‌ఏ- 2ఆర్‌ఎక్స్‌) సొల్యూషన్‌ ఉందని దీని వల్ల ఈ ధరల విభాగంలోని 4జీ కంటే కూడా 5 రెట్ల వరకు అధిక వేగం ఉంటుందని వెల్లడించింది.


ఈ ఫోన్లలో ఈ చిప్‌ను వాడటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 280 కోట్ల మందికి 5జీ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిప్‌తో కూడిన మొదటి ఫోను ఈ ఏడాది చివరినాటికి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రారంభ స్థాయి చిప్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేయడంతో భాగంగా రిలయన్స్‌ జియోతో పాటు ఇతర ఫోన్ల తయారీ కంపెనీలతో క్వాల్‌కామ్‌ ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. భారత మార్కెట్లోని మిలియన్ల మంది 2జీ వినియోగదారులను నేరుగా 5జీ ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్‌లను అందించడానికి కొత్త చిప్‌సెట్ సాయపడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయంతో భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 280 కోట్ల మంది ప్రజలకు 5జీ సేవలు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జియో, క్వాల్ కామ్ వర్గాల సమాచారం. కొనుగోలు చేయాలి. ఈ విధంగా రియలన్స్‌ జియో మరో అద్భుతానికి తెర తీస్తోంది. ఈ 5జీ టెక్నాలజీ మొబైల్ వస్తే మానవాళి మనుగడ ఇంకా ఫోన్ పైన్ ఆధారపడి ఉంటారేమో . ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి .







Untitled Document
Advertisements