బంగారం కొనాలి అనుకునే వారికి శుభవార్త.. పడిపోయిన ధరలు

     Written by : smtv Desk | Mon, Mar 25, 2024, 09:35 AM

బంగారం కొనాలి అనుకునే వారికి శుభవార్త.. పడిపోయిన ధరలు

ఆడవాళ్లకు బంగారం అంటే ఎంతో ఇష్టం . ఏ ఫంక్షన్ కి వెళ్లిన పండుగ సందర్భాలలో ఎక్కవగా గోల్డ్ ఆభరణాలు వేసుకుంటారు . కానీ ఎప్పుడు గోల్డ్ రేట్ రోజు రోజు కు పెరిగి పోతుంది దీని కారణంగా గోల్డ్ కొనుకోవాలి అంటే భయపడుతున్నారు . అయితే మీకు గుడ్ న్యూస్. పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు వెలవెలబోతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. పసిడి రేటు పడిపోతూ వస్తోంది. గోల్డ్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పరుగులు పెట్టడం వల్ల ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడింది. అందుకే గత కొంత కాలంగా బంగారం ధరలు పైపైకి చేరుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు బంగారం ధర బలహీనంగా నడుస్తోంది. పసిడి రేటు పడిపోతూ వస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గోల్డ్ రేటు గత రెండు రోజులుగా పడిపోతూ వచ్చింది.గోల్డ్ కోనుకునే వారికి ఇది సానుకూల సమయం అని చెప్పుకోవచ్చు. బంగారం ధరలు ఏ మేరకు తగ్గాయో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఇంకా ఈ రోజు గోల్డ్ రేటు ఏ స్థాయిలో ఉందో చూద్దాం.


హైదరాబాద్‌లో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇటీవల రూ. 67 వేల స్థాయికి పైకి చేరిన బంగారం ధరలు తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది. అయితే తర్వాత పసిడి రేటు ఈ స్థాయి నుంచి పడిపోతూ వచ్చింది.వరుసగా రెండు రోజులు గోల్డ్ రేట్లు తగ్గుతూ వస్తున్నాయి . అంటే గోల్డ్ రేటు రెండు రోజుల్లోనే చాల వరకు పడిపోయిందని చెప్పుకోవచ్చు. దీంతో ఈ రోజు బంగారం ధర రూ. 66,970కు దిగి వచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది. మార్చి 24న ఈ రేట్లు వర్తిస్తాయి.అలాగే 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. ఈ గోల్డ్ రేటు కూడా పడిపోయింది. రెండు రోజుల్లోనే రూ. 550 మేర పడిపోయింది. దీంతో ఈ పసిడి రేటు రూ. 61,950 నుంచి రూ. 61,400కు దిగి వచ్చింది. పది గ్రాములకు ఈ రేట్లు వర్తిస్తాయి.
ఇక వెండి రేటు విషయానికి వస్తే.. సిల్వర్ రేటు హెచ్చతగ్గులకు లోనవుతూ వస్తోంది. వెండి రేటు గత రెండు రోజుల కాలంలో ఒక రోజు పెరిగితే.. మరో రోజు దిగి వచ్చింది. ఒక రోజు రూ.2 వేలు తగ్గితే.. మరో రోజు రూ.1000 పెరిగింది. అంటే మొత్తంగా రూ.1,000 మేర వెండి తగ్గిందని చెప్పుకోవచ్చు. వెండి రేటు ప్రస్తుతం కేజీకి రూ. 77500 వద్ద ఉంది.కాగా పైన ఇచ్చిన బంగారం, వెండి ధరలు వస్తు సేవల పన్నుగా చెప్పుకునే జీఎస్‌టీ అదనంగా పడుతుంది. అలాగే జువెలరీ తయారీ చార్జీలు కూడా ఉంటాయి. అందుకే వీటిని కలుపుకుంటే గోల్డ్, సిల్వర్ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు . దీన్నీ బట్టి ఫ్యూచర్ లో గోల్డ్ , సిల్వర్ రేట్స్ ఇంకా పెరిగి పోతాయి . కావున మన దగర మనీ ఉన్నప్పుడు కొనుకోవాలి . గోల్డ్ ను సేవింగ్ గా పెట్టుబడి చేయవచ్చును .





Untitled Document
Advertisements