ఏఐలో పట్టు సాధించడం యువతకు ముఖ్యం అన్న మోడీ

     Written by : smtv Desk | Sat, Mar 30, 2024, 10:51 AM

ఏఐలో పట్టు సాధించడం యువతకు ముఖ్యం అన్న మోడీ

నేటి ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ అవసరం అనేక రకాలుగా ఉంటుంది . ప్రస్తుత ప్రపంచంలో కంప్యూటర్ లో అనేక కోర్సులు వస్తున్నాయి అందులో ఆర్టిఫిషల్ ఇంటెలిజెంట్ (ఏఐ )ప్రధాన పాత్ర పోషిస్తుంది. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దీని గురించి మాట్లాడారు . భవిష్యత్తులో అప్పుడే పుట్టిన పిల్లలు కూడా ఏఐ(పసిపిల్లలు ఆయ్‌ అంటూ ఏడవడం) అని అంటారని పేర్కొన్నారు. నేటితరం పిల్లలు అన్ని విషయాల్లో అడ్వాన్స్‌డ్‌గా ఉంటున్నారని తెలిపారు. డీప్‌ఫేక్‌ సాంకేతికత వినియోగం విషయంలో కొన్ని నియంత్రణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో తమ ప్రభుత్వం తిరిగి ఏర్పాటైన వెంటనే గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు అవసరమైన అధ్యయనానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌, ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమావేశమయ్యారు.

ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), భవిష్యత్‌ టెక్నాలజీ, మహిళా సాధికారత తదితర అంశాలపై చర్చించారు. వివిధ రంగాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించే విషయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో భారత్‌ అనుసరిస్తున్న తీరును బిల్‌గేట్స్‌ ఈ సందర్భంగా ప్రశంసించారు. సాంకేతికతను ప్రజలకు చేరువచెయ్యడంలోనూ భారత్‌ తీరు అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా ఏఐ గురించి ప్రధాని మాట్లాడుతూ దేశంలో చాలామంది అమ్మను ఆయ్‌(ఏఐ)ని పలుకుతారని, నేటి పరిస్థితులను చూస్తే పిల్లలు పుట్టిన వెంటనే ఏఐ(కృతిమ మేధ) అనేలా ఉన్నారని అన్నారు. ఏఐ గొప్ప సాంకేతిక పరిజ్ఞానమని పేర్కొన్న మోదీ.. ఆ సాంకేతికత వల్లే జీ20 సదస్సులో తన ప్రసంగం అనేక భాషల్లోకి సులువుగా అనువాదమైందని తెలిపారు.

ఈ సందర్భంగా డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ వాడకంపై ప్రపంచం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ వంటి ప్రజాస్వామ్య దేశంలో డీప్‌ ఫేక్‌ను ఎవరైనా స్వేచ్ఛగా వాడే వీలు ఉందన్నారు. డీప్‌ ఫేక్‌ కంటెంట్‌ను ఏఐ సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ సాంకేతికత వినియోగం అంశంలో కొన్ని నియంత్రణలు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ఏఐను ప్రజలు ఓ సాధనంగా చూడాలని, ఆ సాంకేతికత వల్ల తప్పుదోవ పట్టకూడదని సూచన చేశారు. సాంకేతిక పరిజ్ఞానం దేశంలో అందరికీ అందుబాటులో ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
అందుకని గ్రామీణ ప్రాంత మహిళలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడంతోపాటు తగిన శిక్షణ ఇప్పించడం ద్వారా మహిళా సాధికారికత సాధించడం తన లక్ష్యమని ప్రధాని తెలిపారు. ఈ టెక్నాలజీ వినియోగంతో వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. కొవిడ్‌ సమయంలో కొవిన్‌ యాప్‌ ద్వారా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సులభతరం చేశామన్నారు. అంతేకాకుండా విద్యారంగంలో సాంకేతికత వినియోగాన్ని పెంచామని తెలిపారు. ఇక,లోక్సభ ఎన్నికలు పూర్తి అయినా తర్వాత మళ్ళి కేంద్రంలో తమ ప్రభుత్వం తిరిగి ఏర్పాటైన వెంటనేస్త్రీ లకు వచ్చే గర్భాశయ క్యాన్సర్‌ అధ్యయనంపై దృష్టి పెడతామని, దానికి కావాల్సిన టీకా అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని , అంతేకాకుండా ప్రస్తుత కాలంలో (ఏ ఐ) యువతకు ఎంతో అవసరం దీనిని దృష్టిలో పెట్టుకొని వారికీ ఉచిత శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు.





Untitled Document
Advertisements