నెట్టింట శ్రీలీల క్రేజ్ మాములుగా లేదుగా

     Written by : smtv Desk | Sat, Mar 30, 2024, 04:02 PM

నెట్టింట శ్రీలీల క్రేజ్ మాములుగా లేదుగా

శ్రీలీల కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ అమ్మ‌డు తన , అంధ , చందాలతో ప్రేక్షకులను మేప్పిస్తుంది.ఈ అమ్మడు ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంది. యంగ్ హీరోల నుంచి సూపర్ స్టార్ హీరోల‌కు ప్ర‌మోట్ అవ్వ‌డంతో సొగ‌స‌రి క్రేజ్ రెట్టింపు అయింది.ఈ అమ్మ‌డు హాట్ అప్పీరియ‌న్స్ కి తొలి నుంచి దూరమే. సెగలు పుట్టించే భంగిమ‌లు ఫోటోల‌కు మాత్రం దూరంగా ఉంటుంది. అలాగ‌ని స్కిన్ షోకి దూరంకాదు. ఓ మొతాదు డోస్ లో అల‌రిస్తుంటుంది. వీలైనంత వర‌కూ డిజైన‌ర్ దుస్తుల్లో క‌టౌట్ కి త‌గ్గ ఎంపిక‌ల‌తోనే హైలైట్ అవుతుంది.

తాజాగా సొస‌గ‌రి మ‌రో కొత్త ఫోటోతో నెట్టింట్లోకి వ‌చ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా పింక్ వ‌ర్ణం దుస్తుల్లో వావ్ అనిపించే లుక్ తో అందరిని ఆక‌ట్టుకుంటుంది. సొగ‌స‌రి స్కిన్ టోన్ పై ఈ వ‌ర్ణం ఎంతో అందంగా క‌నిపిస్తుంది. స్కిన్ సైతం రోజ్ బ్యూటీ త‌ల‌పించేలా మేకప్ , వేసుకొని కుర్రాళ్లను రెచ్చ గోటేలాగా ఆమె పెట్టిన పొజ్జు ఫోట్స్ అందరిని అలరిస్తున్నాయి . చాల మంది గార్జియ‌స్ బ్యూటీఫుల్ ..ల‌వ్ యూ బంగారం అంటూ పొగిడేస్తూ ప్ర‌పోజ్ చేస్తున్నారు. ఇక శ్రీలీల కెరీర్ సంగ‌తి చూస్తే ఇటీవ‌లే `గుంటూరు కారం`తో హిట్ అందుకుంది. కానీ ఆ హీట్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అమ్మ‌డికి కొత్త అవ‌కాశాలు అంటూ ఇక్క‌డేమి రాలేదు. దీంతో కోలీవుడ్ లో లాంచ్ అయ్యే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది.

ఇటీవ‌లే ఓ కాలేజ్ ఈవెంట్లో అక్క‌డ సినిమాల్లో న‌టించాల‌ని ఉంద‌ని ఓపెన్ అయింది. దీంతో టాలీవుడ్ లో ఖాళీగా ఉండ‌టంతోనే అక్క‌డ సినిమాల‌పై దృష్టి పెడుతుంద‌ని ఓ అంచ‌నాకి వ‌చ్చేసారు. మ‌రీ స‌న్న‌జాజి సోయ‌గానికి అక్క‌డ ఎలాంటి అవ‌కాశాలు వ‌స్తాయో చూడాలి. చ‌బ్బీ భామ‌ల‌కిచ్చిన ప్రాముఖ్య‌త నాజూగు భామ‌ల‌కు లేద‌నే విమ‌ర్శ అక్క‌డ ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది.ఏది ఏమైనా నెట్టింట ఈ అమ్మడు చేసే సందడికి అందరూ ఫిదా అవ్వవలసిందే ఈ అమ్మడు ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంది అంత క్రెజ్ సంపాదించుకుంది.







Untitled Document
Advertisements