గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై అనుపమ్ ఖేర్ ఆసక్తికర ట్వీట్

     Written by : smtv Desk | Wed, May 01, 2024, 11:13 AM

గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్  ఎన్టీఆర్ పై అనుపమ్ ఖేర్ ఆసక్తికర ట్వీట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉండే ఫ్యాన్ బేస్ సపరేట్. ఇక పాన్ ఇండియా సినిమాగా వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం ముంబైలో బేస్ పెంచుకునే పనిలో ఉన్నారు తారక్. 'వార్ 2' బాలీవుడ్ మూవీలో తారక్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇటీవల తన భార్య ప్రణతితో కలిసి ఓ డిన్నర్ పార్టీకి తారక్ వెళ్లిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.

తాజాగా తారక్ ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. తారక్ ను కలిసిన ఫొటోను అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన ఫేవరెట్ పర్సన్ తారక్ ను కలవడం సంతోషంగా ఉందని అనుపమ్ ఖేర్ అన్నారు. తారక్ పని చేసే విధానం తనకు ఎంతో ఇష్టం అని చెప్పారు. తారక్ ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ ట్వీట్ చూసిన తారక్ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.





Untitled Document
Advertisements