పెసర పప్పుతో టేస్ట్ ఈవెనింగ్ స్నాక్.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే

     Written by : smtv Desk | Sat, Mar 30, 2024, 04:35 PM

పెసర పప్పుతో  టేస్ట్ ఈవెనింగ్ స్నాక్.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే

రోజూ పొద్దునే రకారకాలైన టిఫిన్స్ ఇడ్లీ, దోసె, చపాతీ, పూరీ చేసి అలసిపోయారా , అయితే కొత్తగా డిఫరెంట్ గా ఈ టిఫిన్ ట్రై చేయండి. మీ ఇంట్లో పసెసరపప్పు ఉంటే చాలు ఇది రెడీ అయినట్లే . ఈ పచ్చి పెసరపప్పు వంటకం చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైనది. ప్రధానంగా సాయంత్రం పూట చిరుతిండిగా తినవచ్చు. మీరుపెసర పునుగులను ఎలా తయారు చేయాలో చూదాం :

కావాల్సిన పదార్థాలు :

పెసరపప్పు - 1 కప్పు
ఉద్ది పప్పు - 1/4 కప్పు
పచ్చిమిర్చి - 2
వెల్లుల్లి - 6 రెబ్బలు
అల్లం - 1 చిన్న ముక్క
ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినవి)
జీలకర్ర - 1/2 tsp
ఉప్పు - రుచి ప్రకారం
స్వీట్ కార్న్ - 1/2 కప్పు
కొబ్బరి - 1/4 కప్పు (తరిగినవి)
కరివేపాకు - కొద్దిగా (సన్నగా తరిగినవి)
కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినవి)
నెయ్యి - కావలసిన పరిమాణం

తయారుచేయు రెసిపీ:

1 ముందుగా ఒక గిన్నెలో పచ్చి పెసరపప్పు, ఉద్ది పప్పులను వేసి కలిపి రెండుసార్లు నీళ్లలో కడిగేయాలి.
2 ఆ తర్వాత అందులో గిన్నెలో పప్పు మునిగేలా నీళ్లు పోసి మూతపెట్టి 2-3 గంటలు నాననివ్వాలి.
3 2-3 గంటల తర్వాత నానబెట్టిన పచ్చిపెసరపప్పు, ఉద్ది పప్పును మిక్సీ జార్ లో వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి.
4 అవసరమైతే కొంచెం నీరు కలపండి. కానీ ఎక్కువ నీరు కలపవద్దు. ఇడ్లీ పిండిలా ఉండాలని గుర్తుంచుకోండి.
5 తర్వాత ఈ పిండి ఒక గిన్నెలోకి తీసుకుని అందులో జీలకర్ర, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి, స్వీట్ కార్న్, రుచికి సరిపడా
ఉప్పు వేసి బాగా కలపాలి.
6 తర్వాత స్టౌ మీద పుల్లంట్లు పాన్ (పడ్డు మౌల్డ్ ) పెట్టి నెయ్యి పోసి వేడి చేసి, పిండిని గుంతల్లో పోసి బంగారు రంగు వచ్చేవరకు ఉడికించుకుంటే రుచికరమైన పెసర పునుగులు రెడీ. వీటిని ఒకసారి రుచి చూస్తే మళ్ళి మళ్ళి కావలి అంటారు . వీటిలో వినియోగించిన పదార్థాలు అన్ని కూడా మన ఆరోగ్యానికి మంచివే .





Untitled Document
Advertisements